ప్రభన్యూస్

Plane Crash: ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం.. నివాస ప్రాంతంలో కూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం! |


Last Updated:

Plane Crash: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఆదివారం అత్యంత ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పామ్ బీచ్ కౌంటీలోని నివాస ప్రాంతంలో ఓ బిజినెస్ జెట్ విమానం కుప్పకూలింది.

PC: X.com
PC: X.com

ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 9 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి (యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ) సీన్ డఫీ అధికారికంగా ధ్రువీకరించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన ‘లియర్‌జెట్ 60’ (Learjet 60) అనే ప్రైవేట్ విమానం బహమాస్‌కు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటలకు (17:50 GMT) పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవెన్ నివాస సముదాయం సమీపంలో ఈ విమానం నేలకూలింది. ప్రమాదం జరిగిన ప్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రసిద్ధ ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌కు కేవలం 9 మైళ్ల (దాదాపు 14 కిలోమీటర్లు) దూరంలోనే ఉండటం గమనార్హం.

భారీ గొయ్యి.. చెల్లాచెదురైన శకలాలు

ప్రమాద తీవ్రతకు రహదారి మధ్యలో భారీ గొయ్యి ఏర్పడింది. విమాన శకలాలు, కాంక్రీట్ దిమ్మెలు చెల్లాచెదురుగా పడిపోవడంతో పాటు పలుచోట్ల మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానం సెకనుకు వందల అడుగుల వేగంతో అమాంతం కిందికి దూసుకువచ్చినట్లు ఫ్లైట్ డేటా, అమెరికన్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఓ కారు డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ఆకాశం నుంచి నిట్టనిలువుగా రాకెట్ మాదిరిగా విమానం నేలను ఢీకొట్టడం, ఆ వెంటనే భారీ పేలుడు సంభవించి అగ్నిగోళంలా మారడం ఆ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ స్పందిస్తూ.. “ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆకాశం నుంచి ఓ క్షిపణి వచ్చి పడినట్లు ఉంది. భారీ పేలుడు జరిగి శకలాలు నలుదిక్కులా చెల్లాచెదురయ్యాయి” అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

విమానంలో ఉన్నవారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ప్రమాదంలో భూమిపై ఉన్న స్థానికులు ఎవరూ చనిపోవడం కానీ, గాయపడటం కానీ జరగలేదని ప్రాథమికంగా తెలిసిందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ ఘటనను భయంకరమైన విషాదంగా పేర్కొన్న సీన్ డఫీ.. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణకు సహకరించేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుంచి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు.

600 మంది తరలింపు.. 30 రోజుల పాటు రహదారి మూసివేత

రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు ఉండే ఆరు లైన్ల మిలిటరీ ట్రయల్ రోడ్డుపై విమానం కూలడంతో పామ్ బీచ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ విభాగం దీనిని ‘మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్’గా వర్గీకరించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ట్రైలర్ పార్క్ కమ్యూనిటీ నుంచి దాదాపు 600 మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు దాటికి మంచినీటి పైప్‌లైన్లు సహా స్థానిక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ రహదారిని కనీసం 30 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో అక్కడ భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొంది. మరోవైపు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాదం జరగడానికి సుమారు గంట ముందు వరకు మార్-ఎ-లాగోలోనే ఉండి, సమీపంలోని విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 9:50 am Digital Edition : Prabhanews
Plane Crash: ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం.. నివాస ప్రాంతంలో కూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం! |

Last Updated:Nov 02, 2026 9:46 AM ISTPlane Crash: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఆదివారం అత్యంత ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పామ్ బీచ్ కౌంటీలోని నివాస ప్రాంతంలో ఓ బిజినెస్ జెట్ విమానం కుప్పకూలింది.PC: X.comఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 9 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి (యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ) సీన్ డఫీ అధికారికంగా ధ్రువీకరించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన 'లియర్‌జెట్ 60' (Learjet 60) అనే ప్రైవేట్ విమానం బహమాస్‌కు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటలకు (17:50 GMT) పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవెన్ నివాస సముదాయం సమీపంలో ఈ విమానం నేలకూలింది. ప్రమాదం జరిగిన ప్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రసిద్ధ ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌కు కేవలం 9 మైళ్ల (దాదాపు 14 కిలోమీటర్లు) దూరంలోనే ఉండటం గమనార్హం.భారీ గొయ్యి.. చెల్లాచెదురైన శకలాలుప్రమాద తీవ్రతకు రహదారి మధ్యలో భారీ గొయ్యి ఏర్పడింది. విమాన శకలాలు, కాంక్రీట్ దిమ్మెలు చెల్లాచెదురుగా పడిపోవడంతో పాటు పలుచోట్ల మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానం సెకనుకు వందల అడుగుల వేగంతో అమాంతం కిందికి దూసుకువచ్చినట్లు ఫ్లైట్ డేటా, అమెరికన్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఓ కారు డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ఆకాశం నుంచి నిట్టనిలువుగా రాకెట్ మాదిరిగా విమానం నేలను ఢీకొట్టడం, ఆ వెంటనే భారీ పేలుడు సంభవించి అగ్నిగోళంలా మారడం ఆ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ స్పందిస్తూ.. "ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆకాశం నుంచి ఓ క్షిపణి వచ్చి పడినట్లు ఉంది. భారీ పేలుడు జరిగి శకలాలు నలుదిక్కులా చెల్లాచెదురయ్యాయి" అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.విమానంలో ఉన్నవారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ప్రమాదంలో భూమిపై ఉన్న స్థానికులు ఎవరూ చనిపోవడం కానీ, గాయపడటం కానీ జరగలేదని ప్రాథమికంగా తెలిసిందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ ఘటనను భయంకరమైన విషాదంగా పేర్కొన్న సీన్ డఫీ.. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణకు సహకరించేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుంచి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు.600 మంది తరలింపు.. 30 రోజుల పాటు రహదారి మూసివేతరెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు ఉండే ఆరు లైన్ల మిలిటరీ ట్రయల్ రోడ్డుపై విమానం కూలడంతో పామ్ బీచ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ విభాగం దీనిని ‘మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్’గా వర్గీకరించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ట్రైలర్ పార్క్ కమ్యూనిటీ నుంచి దాదాపు 600 మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు దాటికి మంచినీటి పైప్‌లైన్లు సహా స్థానిక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ రహదారిని కనీసం 30 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రమాద సమయంలో అక్కడ భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొంది. మరోవైపు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాదం జరగడానికి సుమారు గంట ముందు వరకు మార్-ఎ-లాగోలోనే ఉండి, సమీపంలోని విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.మరింత చదవండి

Source link