బులియన్స్.కో.ఇన్ (bullions.co.in) వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అక్టోబర్ 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,500గా ఉంది. అయితే నవంబర్ 1వ తేదీ నాటికి ఈ ధర రూ.1,38,810కు పడిపోయింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.11,690 తగ్గింది. బంగారం ధరల్లో ఈ స్థాయి తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా ఇదే బాటలో భారీగా తగ్గాయి. సాధారణంగా నగలు కొనుగోలు చేసేవారు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటి వారికి కూడా తాజా ధరల తగ్గుదల ప్రయోజనం కలిగించనుంది. హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 1వ తేదీ నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,240కు చేరింది. అయితే ఆభరణాలు కొనేటప్పుడు బంగారం ధరతో పాటు మజూరీ, తరుగు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

