పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 7.55 శాతం నుంచి 14.30 శాతం వరకు ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ.10,031 నుంచి రూ.11,712 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. ఇది రూ.1,000 నుంచి రూ.15,000 వరకు ఉండొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 7.85 శాతం నుంచి 10.95 శాతం వరకు ఉన్నాయి. ఈఎంఐ రూ.10,102 నుంచి రూ.10,859 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం వరకు ఉండొచ్చు. ఇది రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో కారు లోన్ల వడ్డీ రేట్లు 8.45 శాతం నుంచి 9.50 శాతం వరకు ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ.10,246 నుంచి రూ.10,501 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

