ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా రోజులో కనీసం ఒక్కసారైనా అన్నం తినేవారు చాలామంది ఉంటారు. అయితే, మధుమేహం ఉన్నవారు అన్నం తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తుంటారు. అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటంతో, అది జీర్ణమైనప్పుడు గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుంది. అయితే, తాజాగా వండిన అన్నంతో పోలిస్తే, చల్లార్చి మళ్లీ వేడి చేసిన అన్నం తినడం వల్ల కొందరిలో రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అన్నంలోని పిండిపదార్థాల నిర్మాణంలో వచ్చే మార్పులేనని డైటీషియన్ శ్రీలత అన్నారు.

