ప్రభన్యూస్

JD Vance: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన జేడీ వాన్స్.. అత్తమామల ప్రస్తావనతో యూటర్న్! |


Last Updated:

హెచ్-1బీ వీసాదారులను వెట్టిచాకిరీ బానిసలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన దక్షిణ భారత అత్తమామలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు సరికాదని అంగీకరించారు.

News18
News18

హెచ్-1బీ వీసాదారులను విదేశీ బానిసలు, వెట్టిచాకిరీ కూలీలుగా పేర్కొంటూ తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన భాష కొంత శృతిమించిందని అంగీకరించిన ఆయన, ఆ మాటలు సరైనవి కావని వివరణ ఇచ్చారు. విదేశీ నిపుణులను గౌరవించడంతో పాటు స్థానిక అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంలో సమతుల్యత పాటించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చిన తన అత్తమామలను ఎంతో ప్రేమిస్తానని, అక్కడ పుట్టిన వారి కుమార్తె ఉషా వాన్స్ ప్రస్తుతం సెకండ్ లేడీగా బాధ్యతలు చేపట్టినందుకు గర్విస్తున్నానని గుర్తుచేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వారికి స్వాగతం పలకాల్సిందేనని, అదే సమయంలో స్వదేశీ నిపుణులను తీసేసి విదేశీయులను నియమించుకోవడం న్యాయం కాదని అభిప్రాయపడ్డారు.

భారత్‌ తీవ్ర అభ్యంతరం.. వాన్స్ వెనకడుగు

గతంలో హెచ్-1బీ నిపుణులపై వాన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు గ్రీన్‌కార్డు ప్రక్రియలో మొదటి దశ అయిన పర్మ్ (PERM) ప్రోగ్రామ్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. స్థానిక అమెరికన్లు చేయగలిగే పనుల కోసం విదేశాల నుంచి సేవకులను దిగుమతి చేసుకోవడం ఆపాలని ఘాటుగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ నిపుణులను ఇలా కించపరచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తీవ్ర అభ్యంతరకరమని గట్టిగా బదులిచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగానికి భారతీయ టెక్కీలు చేస్తున్న విలువైన సహకారాన్ని విస్మరించడం తగదని భారత్ తేల్చి చెప్పింది.

భారత్ నుంచి గట్టి ప్రతిస్పందన రావడంతో వాన్స్ తన ప్రకటనను సమర్థించుకుంటూనే వెనక్కి తగ్గారు. అమెరికన్ కంపెనీలు స్థానిక ఉద్యోగులను పక్కన పెట్టకుండా చూసేందుకే ఈ నిబంధనలు తెస్తున్నామని, ఇరు వర్గాల ప్రయోజనాలను కాపాడే విధానమే సరైందని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 4:15 pm Digital Edition : Prabhanews
JD Vance: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన జేడీ వాన్స్.. అత్తమామల ప్రస్తావనతో యూటర్న్! |

Last Updated:Oct 18, 2026 4:12 PM ISTహెచ్-1బీ వీసాదారులను వెట్టిచాకిరీ బానిసలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన దక్షిణ భారత అత్తమామలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు సరికాదని అంగీకరించారు.News18హెచ్-1బీ వీసాదారులను విదేశీ బానిసలు, వెట్టిచాకిరీ కూలీలుగా పేర్కొంటూ తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన భాష కొంత శృతిమించిందని అంగీకరించిన ఆయన, ఆ మాటలు సరైనవి కావని వివరణ ఇచ్చారు. విదేశీ నిపుణులను గౌరవించడంతో పాటు స్థానిక అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంలో సమతుల్యత పాటించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చిన తన అత్తమామలను ఎంతో ప్రేమిస్తానని, అక్కడ పుట్టిన వారి కుమార్తె ఉషా వాన్స్ ప్రస్తుతం సెకండ్ లేడీగా బాధ్యతలు చేపట్టినందుకు గర్విస్తున్నానని గుర్తుచేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వారికి స్వాగతం పలకాల్సిందేనని, అదే సమయంలో స్వదేశీ నిపుణులను తీసేసి విదేశీయులను నియమించుకోవడం న్యాయం కాదని అభిప్రాయపడ్డారు.భారత్‌ తీవ్ర అభ్యంతరం.. వాన్స్ వెనకడుగుగతంలో హెచ్-1బీ నిపుణులపై వాన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు గ్రీన్‌కార్డు ప్రక్రియలో మొదటి దశ అయిన పర్మ్ (PERM) ప్రోగ్రామ్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. స్థానిక అమెరికన్లు చేయగలిగే పనుల కోసం విదేశాల నుంచి సేవకులను దిగుమతి చేసుకోవడం ఆపాలని ఘాటుగా మాట్లాడారు.
Indian-American: You called H-1B workers “indentured servants”. Why are you scapegoating immigrants?
VP JD Vance: You know where my family comes from. I love my in-laws who immigrated here from South India. We should welcome people who contribute but we need a balanced system https://t.co/AY2ZG2aLxt— Shashank Mattoo (@MattooShashank) October 18, 2026ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ నిపుణులను ఇలా కించపరచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తీవ్ర అభ్యంతరకరమని గట్టిగా బదులిచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగానికి భారతీయ టెక్కీలు చేస్తున్న విలువైన సహకారాన్ని విస్మరించడం తగదని భారత్ తేల్చి చెప్పింది.భారత్ నుంచి గట్టి ప్రతిస్పందన రావడంతో వాన్స్ తన ప్రకటనను సమర్థించుకుంటూనే వెనక్కి తగ్గారు. అమెరికన్ కంపెనీలు స్థానిక ఉద్యోగులను పక్కన పెట్టకుండా చూసేందుకే ఈ నిబంధనలు తెస్తున్నామని, ఇరు వర్గాల ప్రయోజనాలను కాపాడే విధానమే సరైందని స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link