ప్రభన్యూస్

Tollywood: లవ్ మ్యారేజా?.. అరేంజ్డ్ మ్యారేజా? సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘3 2 1’..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా.

News18
News18

వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా. పెళ్లి విషయంలో ప్రేమ వివాహం మంచిదా? పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదా? అనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా దీన్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా అక్టోబరు 23న థియేటర్లలో విడుదల కానుంది.

బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో తాను తెరకెక్కించిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్న చిలుముల శాంతికుమార్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబంలోని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసేలా సినిమాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమాలో జూనియర్ సమ్మక్క పాత్రలో కనిపించి ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. మరోవైపు పలు వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ కథానాయకుడిగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సాగే కథ, ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం చుట్టూ తిరిగే సంఘటనలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీరితో పాటు వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుత సమాజంలో పెళ్లి విషయంలో యువతకు, తల్లిదండ్రులకు మధ్య భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా? లేక కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం మంచిదా? అనే ప్రశ్న చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. ఈ అంశాన్ని దర్శకుడు ఎలాంటి కోణంలో చూపించారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, ప్రేమ, వివాహం వంటి అంశాలను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘నను తాకిన’ పాటకు మంచి స్పందన లభించగా, రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటతో పాటు ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను దాటినట్లు చిత్ర బృందం తెలిపింది. విడుదలకు ముందే లభిస్తున్న ఈ స్పందన సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రానికి జాయ్ కాల్విన్ సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలను రచించారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. శివ సర్వాణి ఎడిటర్‌గా పనిచేయగా, నానిబాబు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. వివారెడ్డి టైటిల్, పోస్టర్ల రూపకల్పనలో భాగమయ్యారు.

ప్రస్తుతం చిన్న చిత్రాల్లో విభిన్నమైన కథలు, కొత్త ఆలోచనలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘3 2 1’ కూడా తన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. మరి లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఆసక్తికరమైన అంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే అక్టోబరు 23 వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 4:08 pm Digital Edition : Prabhanews
Tollywood: లవ్ మ్యారేజా?.. అరేంజ్డ్ మ్యారేజా? సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘3 2 1’..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 4:06 PM ISTవినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా. News18వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా. పెళ్లి విషయంలో ప్రేమ వివాహం మంచిదా? పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదా? అనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా దీన్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా అక్టోబరు 23న థియేటర్లలో విడుదల కానుంది.బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో తాను తెరకెక్కించిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్న చిలుముల శాంతికుమార్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబంలోని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసేలా సినిమాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.ఈ చిత్రంలో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమాలో జూనియర్ సమ్మక్క పాత్రలో కనిపించి ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. మరోవైపు పలు వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ కథానాయకుడిగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సాగే కథ, ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం చుట్టూ తిరిగే సంఘటనలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీరితో పాటు వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రస్తుత సమాజంలో పెళ్లి విషయంలో యువతకు, తల్లిదండ్రులకు మధ్య భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా? లేక కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం మంచిదా? అనే ప్రశ్న చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. ఈ అంశాన్ని దర్శకుడు ఎలాంటి కోణంలో చూపించారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, ప్రేమ, వివాహం వంటి అంశాలను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘నను తాకిన’ పాటకు మంచి స్పందన లభించగా, రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటతో పాటు ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను దాటినట్లు చిత్ర బృందం తెలిపింది. విడుదలకు ముందే లభిస్తున్న ఈ స్పందన సినిమాపై అంచనాలను పెంచుతోంది.ఈ చిత్రానికి జాయ్ కాల్విన్ సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలను రచించారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. శివ సర్వాణి ఎడిటర్‌గా పనిచేయగా, నానిబాబు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. వివారెడ్డి టైటిల్, పోస్టర్ల రూపకల్పనలో భాగమయ్యారు.ప్రస్తుతం చిన్న చిత్రాల్లో విభిన్నమైన కథలు, కొత్త ఆలోచనలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘3 2 1’ కూడా తన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. మరి లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఆసక్తికరమైన అంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే అక్టోబరు 23 వరకు వేచి చూడాల్సిందే.మరింత చదవండి

Source link