ప్రభన్యూస్

Kaviya Maran Marriage: గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.. నవంబర్‌లో అనిరుధ్‌ను పెళ్లి చేసుకోనున్న కావ్య మారన్! డేట్స్ ఇవే | క్రీడా వార్తలు


Last Updated:

Kaviya Maran Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సామాజిక మాధ్యమాలు, సినీ వర్గాల్లో తీవ్ర ప్రచారం సాగుతోంది.

కావ్య మారన్, అనిరుధ్
కావ్య మారన్, అనిరుధ్

2026 నవంబర్ నెలలో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తుండగా, తాజాగా చెన్నైలో ఏర్పాటు చేయనున్న వీరి రిసెప్షన్ వేడుక తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?

‘వలై పేచు’ తదితర వర్గాల నుంచి వస్తున్న కథనాల ప్రకారం.. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్ దేశంలో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం నడుస్తోంది. విదేశాల్లో వివాహం పూర్తయిన అనంతరం, తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

రిసెప్షన్ తేదీలో మార్పు.. ఆహ్వానాలు ప్రారంభం?

చెన్నైలో జరగనున్న వెడ్డింగ్ రిసెప్షన్ తొలుత నవంబర్ 14న జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ వేడుకను నవంబర్ 21కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పునకు గల నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, తెలంగాణ సీఎంఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక అప్‌డేట్ వెలువడినట్లు వార్తల్లో పేర్కొన్నారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లు ఆ కథనాల్లో ఉంది. నవంబర్ 21న చెన్నైలో ఈ విందు జరగనుందని ఆ వివరాల్లో వెల్లడించారు.

అతిథుల జాబితాలో ప్రముఖులు.. అధికారిక ప్రకటన రావాల్సిందే!

ఈ వేడుకలకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపడం మొదలైందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు నుంచి నటుడు, రాజకీయ నేత దళపతి విజయ్‌తో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు పేర్కొంటున్నాయి. కాగా, వేడుకల ఏర్పాట్లు లేదా అతిథుల జాబితాపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 8:32 am Digital Edition : Prabhanews
Kaviya Maran Marriage: గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.. నవంబర్‌లో అనిరుధ్‌ను పెళ్లి చేసుకోనున్న కావ్య మారన్! డేట్స్ ఇవే | క్రీడా వార్తలు

Last Updated:Oct 17, 2026 8:26 AM ISTKaviya Maran Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సామాజిక మాధ్యమాలు, సినీ వర్గాల్లో తీవ్ర ప్రచారం సాగుతోంది.కావ్య మారన్, అనిరుధ్2026 నవంబర్ నెలలో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తుండగా, తాజాగా చెన్నైలో ఏర్పాటు చేయనున్న వీరి రిసెప్షన్ వేడుక తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?'వలై పేచు' తదితర వర్గాల నుంచి వస్తున్న కథనాల ప్రకారం.. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్ దేశంలో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం నడుస్తోంది. విదేశాల్లో వివాహం పూర్తయిన అనంతరం, తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.రిసెప్షన్ తేదీలో మార్పు.. ఆహ్వానాలు ప్రారంభం?చెన్నైలో జరగనున్న వెడ్డింగ్ రిసెప్షన్ తొలుత నవంబర్ 14న జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ వేడుకను నవంబర్ 21కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పునకు గల నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, తెలంగాణ సీఎంఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక అప్‌డేట్ వెలువడినట్లు వార్తల్లో పేర్కొన్నారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లు ఆ కథనాల్లో ఉంది. నవంబర్ 21న చెన్నైలో ఈ విందు జరగనుందని ఆ వివరాల్లో వెల్లడించారు.
Sun Group Chairman Shri Kalanithi Maran and his wife, Smt. Kavery Maran, met Hon’ble Chief Minister Shri A. Revanth Reddy at his residence in Jubilee Hills and invited him to the wedding reception of their daughter, Kavya Maran.
The wedding reception of Kavya Maran and Anirudh Ravichander is scheduled to be held in Chennai on November 21.
#KalanithiMaran #KavyaMaran— Telangana CMO (@TelanganaCMO) October 16, 2026అతిథుల జాబితాలో ప్రముఖులు.. అధికారిక ప్రకటన రావాల్సిందే!ఈ వేడుకలకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపడం మొదలైందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు నుంచి నటుడు, రాజకీయ నేత దళపతి విజయ్‌తో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు పేర్కొంటున్నాయి. కాగా, వేడుకల ఏర్పాట్లు లేదా అతిథుల జాబితాపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.మరింత చదవండి

Source link