అర్హత నిబంధనలు, గరిష్ట లోన్ మొత్తం
సాలరీ పొందే ఉద్యోగులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ లో పని చేసే వారు, మహారత్న, నవరత్న, మినిరత్న కంపెనీలు, డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్, పారా మిలిటరీ సాలరీ ప్యాకేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్యాకేజ్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు అందరూ అర్హులు. వీరి కనీస వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు కావాలి. వీరికి గరిష్ట లోన్ మొత్తం నెలవారీ నికర ఆదాయం 48 రెట్లు వరకు ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ప్రొఫెషనల్స్, వ్యాపారులు కూడా దరఖాస్తు చేయొచ్చు. వీరి కనీస నికర లాభం లేదా పన్ను చెల్లించాల్సిన ఆదాయం 3,00,000 రూపాయలు సంవత్సరానికి ఉండాలి. సాధారణంగా లోన్ అర్హత నికర లాభం లేదా ఐటీఆర్ ప్రకారం వచ్చే ఆదాయం 4 రెట్లు వరకు ఉంటుంది. డిప్రిసియేషన్, ఇప్పటికే ఉన్న లోన్లు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి కనీస వార్షిక ఆదాయం 4,00,000 రూపాయలు కావాలి. వీరికి గరిష్ట లోన్ మొత్తం వార్షిక నికర ఆదాయం 3 రెట్లు వరకు ఉంటుంది.
ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా 8.80 శాతం నుండి 9.85 శాతం వరకు ఉంటుంది. ఇది దరఖాస్తుదారుడి ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్, బ్యాంక్ మార్గదర్శకాలపై ఆధారపడి మారుతుంది. అదనంగా సాధారణ కార్ లోన్ రేటుతో పోలిస్తే 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు కూడా లభిస్తుంది. 5 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటే సాలరీ ఉద్యోగులకు 1000 రూపాయలు తో పాటు జిఎస్‌టి ఉంటుంది. సాలరీ కాని వారికి 1500 రూపాయలు తో పాటు జిఎస్‌టి ఉంటుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ అయితే సాలరీ వారికి 2000 రూపాయలు, సాలరీ కాని వారికి 2500 రూపాయలతో పాటు జిఎస్‌టి ఉంటుంది. 10 లక్షల కంటే ఎక్కువ లోన్ అయితే సాలరీ వారికి 3000 రూపాయలు, సాలరీ కాని వారికి 4000 రూపాయలు తో పాటు జిఎస్‌టి ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లు
కెవైసీ అవసరాలకు ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదనపు డాక్యుమెంట్లు అవసరం ఉండకపోవచ్చు. కొత్త కస్టమర్లు అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. చిరునామా మారితే అడ్రస్ ప్రూఫ్ కూడా అవసరం. సాలరీ ఉద్యోగులు గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, తాజా శాలరీ స్లిప్స్, ఫారం 16, గత 2 సంవత్సరాల ఐటీఆర్ సమర్పించాలి. స్టేట్ బ్యాంక్ సాలరీ ప్యాకేజ్ కస్టమర్లకు కొన్ని డాక్యుమెంట్లు మినహాయింపు ఉండొచ్చు.
స్వయం ఉపాధి పొందేవారు గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, 2 సంవత్సరాల ఐటీఆర్, ఆడిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వాలి. వ్యాపార రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కూడా అవసరం ఉంటుంది. జిఎస్‌టి సర్టిఫికెట్ లేదా పార్టనర్‌షిప్ డీడ్ ఇవ్వొచ్చు. వ్యవసాయదారులు బ్యాంక్ స్టేట్మెంట్లు, భూమి పత్రాలు వంటి ఖస్రా, చిట్టా, అదంగల్ రికార్డులు, డైరీ, పౌల్ట్రీ, హార్టికల్చర్ వంటి కార్యకలాపాల ఆధారాలు ఇవ్వాలి. అందరూ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పూర్తిగా నింపిన లోన్ అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఈ లోన్ ఎందుకు బెటర్?
వాహనం ఆన్ రోడ్ ధరకు 100 శాతం వరకు ఫైనాన్సింగ్ లభించడం వల్ల పెద్ద మొత్తంలో ముందస్తు డబ్బు అవసరం తగ్గుతుంది. తక్కువ వడ్డీ రేటు వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. 8 సంవత్సరాల వరకు రీపేమెంట్ ఆప్షన్ ఉండటం వల్ల ఈఎంఐ నిర్వహణ సులభం అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు ఇలా విభిన్న వర్గాల వారికి ఇది అందుబాటులో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్వసనీయ సేవలు దీనికి మరింత భద్రత ఇస్తాయి.
ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి మంచి అవకాశంగా నిలుస్తుంది. తక్కువ వడ్డీ, ఎక్కువ ఫైనాన్సింగ్, సులభమైన నిబంధనలు ఇవన్నీ కలిసి ప్రజలకు ఈవీ కొనుగోలు మరింత సులభం చేస్తాయి. పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందడుగు వేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది.
