ప్రభన్యూస్

Anant Ambani Tirumala Visit: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ..

తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో సుమారు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని వెల్లడించారు. తిరుమలలో E-బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనంత్ అంబానీ అంగీకారం తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 1:36 am Digital Edition : Prabhanews