సోలార్ ఎక్స్పర్ట్ ఆదిత్య ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, పీఎం సూర్య ఘర్ యోజన కింద 3kW ప్లాంట్‌కు సుమారు రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది. 3kW ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రూ.2,10,000 ఖర్చయితే అందులో రూ.78,000 సబ్సిడీ పొందవచ్చు. కస్టమర్ రూ.20,000 డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకోవచ్చు. ఇంట్లో సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్, మీటర్ కనెక్షన్, అప్రూవల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. రూ.78,000 సబ్సిడీ కారణంగా లోన్ మొత్తం రూ.1.12 లక్షలకు తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

