ప్రభన్యూస్

Jobs: చరిత్ర సృష్టించిన గిరిజన యువత.. 100లో ఏకంగా 99 మందికి ఉద్యోగాలు..! | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

నాణ్యమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి కంపెనీలలో కూడా ఉద్యోగాలను సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటిసి విద్యార్థులు నిరూపించారు.

+

News18

News18

నాణ్యమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి కంపెనీలలో కూడా ఉద్యోగాలను సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటిసి విద్యార్థులు నిరూపించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ కేంద్రం సాధించిన విజయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీర్తించారు. విజయం సాధించిన విద్యార్థులకు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియాజేశారు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోని ఏటిసి పై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం.

నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాది అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటిసి కేంద్రాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయనడానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఏటిసి(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్) కేంద్రం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఉట్నూరులోని ఏటిసిలో నిర్వహించిన ఒకే ఒక క్యాంపస్ డ్రైవ్ లో 100 మంది విద్యార్థులకు గాను 99 మంది విద్యార్థులు వివిధ ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఎక్కువ మంది స్థానిక గిరిజన విద్యార్థులే కావడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన ఈ విద్యార్థులు జూలై, ఆగస్టు నెలల్లో జరిగే వారి తుది పరీక్షల అనంతరం సెప్టెంబర్ నెలలో అధికారికంగా తమ తమ ఉద్యోగాలలో చేరబోతున్నారు.

ఈ క్యాంపస్ డ్రైవ్ లో హైదరాబాద్ కు చెందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్, పూనెకు చెందిన టాటా మోటార్స్ ఇంకా బెంగళురుకు చెందిన ఫాక్స్కాన్ ఆపిల్ ఐఫోన్ విభాగం పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. వీటిలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్  47 మంది విద్యార్థులను 2,37,600 వార్షిక ప్యాకేజీతో నియమించుకోగా, పూణేలోని టాటా మోటార్స్ 36 మంది విద్యార్థులను 2,08,200 వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసింది. బెంగళూరులోని ఫాక్స్కాన్ ఆపిల్ ఐఫోన్ విభాగం 14 మంది మహిళా విద్యార్థులను 2,24,784 నుండి 2,37,600 వరకు వార్షిక ప్యాకేజీలను అందిస్తూ నియమించుకుంది.

కాగా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో ఐటిఐ నెలకొల్పింది. ప్రస్తుతం ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి)గా అప్ గ్రేడ్ అయ్యింది. ఇక్కడ రోబోటిక్స్, సి.ఎన్.సి మెషినింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్ డ్ సిమ్యులేషన్ టెక్నాలజీ తదితర అత్యాధునిక పరిశ్రమల నైపుణ్యాలలో శిక్షణనిస్తున్నారు.  సంప్రదాయ ఐటిఐ కోర్సులతోపాటు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డా శ్రీనివాస్ లోకల్ 18 తో చెప్పారు. విద్యార్థులకు శిక్షణను అందించేందుకు ఈ సంస్థ టాటా టెక్నాలజీస్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు.

బైట్ : రొడ్డ శ్రీనివాస్, ప్రిన్సిపాల్, ఉట్నూరు ఏటిసి

ప్రతిభకు అవకాశం కల్పిస్తే పల్లె యువత కూడా ప్రపంచ స్థాయిలో సత్తాచాటగలరని నిరూపించిన ఉట్నూరు ఏటిసి విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురి ప్రశంసలను అందుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 July 2026, 8:35 am Digital Edition : Prabhanews
Jobs: చరిత్ర సృష్టించిన గిరిజన యువత.. 100లో ఏకంగా 99 మందికి ఉద్యోగాలు..! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Jul 15, 2026 6:31 AM ISTనాణ్యమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి కంపెనీలలో కూడా ఉద్యోగాలను సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటిసి విద్యార్థులు నిరూపించారు.+
News18నాణ్యమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి కంపెనీలలో కూడా ఉద్యోగాలను సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటిసి విద్యార్థులు నిరూపించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ కేంద్రం సాధించిన విజయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీర్తించారు. విజయం సాధించిన విద్యార్థులకు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియాజేశారు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోని ఏటిసి పై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం.నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాది అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటిసి కేంద్రాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయనడానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఏటిసి(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్) కేంద్రం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఉట్నూరులోని ఏటిసిలో నిర్వహించిన ఒకే ఒక క్యాంపస్ డ్రైవ్ లో 100 మంది విద్యార్థులకు గాను 99 మంది విద్యార్థులు వివిధ ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఎక్కువ మంది స్థానిక గిరిజన విద్యార్థులే కావడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన ఈ విద్యార్థులు జూలై, ఆగస్టు నెలల్లో జరిగే వారి తుది పరీక్షల అనంతరం సెప్టెంబర్ నెలలో అధికారికంగా తమ తమ ఉద్యోగాలలో చేరబోతున్నారు.ఈ క్యాంపస్ డ్రైవ్ లో హైదరాబాద్ కు చెందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్, పూనెకు చెందిన టాటా మోటార్స్ ఇంకా బెంగళురుకు చెందిన ఫాక్స్కాన్ ఆపిల్ ఐఫోన్ విభాగం పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. వీటిలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్  47 మంది విద్యార్థులను 2,37,600 వార్షిక ప్యాకేజీతో నియమించుకోగా, పూణేలోని టాటా మోటార్స్ 36 మంది విద్యార్థులను 2,08,200 వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసింది. బెంగళూరులోని ఫాక్స్కాన్ ఆపిల్ ఐఫోన్ విభాగం 14 మంది మహిళా విద్యార్థులను 2,24,784 నుండి 2,37,600 వరకు వార్షిక ప్యాకేజీలను అందిస్తూ నియమించుకుంది.కాగా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో ఐటిఐ నెలకొల్పింది. ప్రస్తుతం ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి)గా అప్ గ్రేడ్ అయ్యింది. ఇక్కడ రోబోటిక్స్, సి.ఎన్.సి మెషినింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్ డ్ సిమ్యులేషన్ టెక్నాలజీ తదితర అత్యాధునిక పరిశ్రమల నైపుణ్యాలలో శిక్షణనిస్తున్నారు.  సంప్రదాయ ఐటిఐ కోర్సులతోపాటు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డా శ్రీనివాస్ లోకల్ 18 తో చెప్పారు. విద్యార్థులకు శిక్షణను అందించేందుకు ఈ సంస్థ టాటా టెక్నాలజీస్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు.బైట్ : రొడ్డ శ్రీనివాస్, ప్రిన్సిపాల్, ఉట్నూరు ఏటిసిప్రతిభకు అవకాశం కల్పిస్తే పల్లె యువత కూడా ప్రపంచ స్థాయిలో సత్తాచాటగలరని నిరూపించిన ఉట్నూరు ఏటిసి విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురి ప్రశంసలను అందుకున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link