ప్రభన్యూస్

Murder Case: రూ.2,200 కోసం దారుణం.. స్నేహితుడినే కత్తితో పొడిచి చంపిన యువకుడు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లా హత్య కేసును 3 రోజుల్లో ఛేదించిన పోలీసులు. రూ.2,200 కోసం సంతోష్‌ను హత్య చేసిన రోహిత్ భాస్కర్ ఖడ్గి అరెస్ట్. ఎస్పీ తుషార్ డూడి పోలీసు బృందాన్ని అభినందించారు.

News18
News18

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఠగ్గువారిపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్ జిల్లాకు చెందిన రోహిత్ భాస్కర్ ఖడ్గి (31)ని అరెస్ట్ చేసినట్లు బంగారుపాళ్యం ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంతోష్ ధర్మదాస్ వర్మ, రోహిత్ భాస్కర్ ఖడ్గి, అబ్దుల్ హబీబ్ రాయిన్ తదితరులు నెలన్నర క్రితం ఉపాధి కోసం బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు వచ్చారు. వ్యాపారం, కూలి పనులు చేస్తూ ఠగ్గువారిపల్లిలోని సాయినగర్‌లో ఒకే అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 11న సంతోష్‌కు రావాల్సిన రూ.17,300 కూలి డబ్బు రోహిత్ ఫోన్‌పే ఖాతాలో జమైంది. సంతోష్ సూచన మేరకు కొంత మొత్తాన్ని ఇతరులకు పంపించిన అనంతరం మిగిలిన రూ.2,200 విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఇద్దరూ మద్యం సేవించి ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన రోహిత్ ఇంట్లో ఉన్న వంటగది కత్తితో సంతోష్ ఛాతీలో పొడవడంతో అతడు తీవ్ర రక్తస్రావానికి గురై కుప్పకూలాడు. అనంతరం రోహిత్ తన యజమాని అబ్దుల్ హబీబ్ రాయిన్‌కు సమాచారం ఇవ్వగా, ఇద్దరూ కలిసి బాధితుడిని బంగారుపాళ్యం ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

మృతుడి భార్య దివంతి సంతోష్ వర్మ ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశాయి. చివరకు మంగళవారం బంగారుపాళ్యం–ఆరగొండ రోడ్డులోని ఆరగొండ ఫ్లైఓవర్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నేరాన్ని ఒప్పుకున్న రోహిత్‌ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేవలం రూ.2,200 కూలి డబ్బుల వివాదం, మద్యం మత్తు, క్షణికావేశం కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వేగంగా కేసును ఛేదించడం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 July 2026, 8:24 am Digital Edition : Prabhanews
Murder Case: రూ.2,200 కోసం దారుణం.. స్నేహితుడినే కత్తితో పొడిచి చంపిన యువకుడు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 14, 2026 10:44 PM ISTచిత్తూరు జిల్లా హత్య కేసును 3 రోజుల్లో ఛేదించిన పోలీసులు. రూ.2,200 కోసం సంతోష్‌ను హత్య చేసిన రోహిత్ భాస్కర్ ఖడ్గి అరెస్ట్. ఎస్పీ తుషార్ డూడి పోలీసు బృందాన్ని అభినందించారు.News18చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఠగ్గువారిపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్ జిల్లాకు చెందిన రోహిత్ భాస్కర్ ఖడ్గి (31)ని అరెస్ట్ చేసినట్లు బంగారుపాళ్యం ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు.పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంతోష్ ధర్మదాస్ వర్మ, రోహిత్ భాస్కర్ ఖడ్గి, అబ్దుల్ హబీబ్ రాయిన్ తదితరులు నెలన్నర క్రితం ఉపాధి కోసం బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు వచ్చారు. వ్యాపారం, కూలి పనులు చేస్తూ ఠగ్గువారిపల్లిలోని సాయినగర్‌లో ఒకే అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 11న సంతోష్‌కు రావాల్సిన రూ.17,300 కూలి డబ్బు రోహిత్ ఫోన్‌పే ఖాతాలో జమైంది. సంతోష్ సూచన మేరకు కొంత మొత్తాన్ని ఇతరులకు పంపించిన అనంతరం మిగిలిన రూ.2,200 విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఇద్దరూ మద్యం సేవించి ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన రోహిత్ ఇంట్లో ఉన్న వంటగది కత్తితో సంతోష్ ఛాతీలో పొడవడంతో అతడు తీవ్ర రక్తస్రావానికి గురై కుప్పకూలాడు. అనంతరం రోహిత్ తన యజమాని అబ్దుల్ హబీబ్ రాయిన్‌కు సమాచారం ఇవ్వగా, ఇద్దరూ కలిసి బాధితుడిని బంగారుపాళ్యం ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.మృతుడి భార్య దివంతి సంతోష్ వర్మ ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశాయి. చివరకు మంగళవారం బంగారుపాళ్యం–ఆరగొండ రోడ్డులోని ఆరగొండ ఫ్లైఓవర్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నేరాన్ని ఒప్పుకున్న రోహిత్‌ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేవలం రూ.2,200 కూలి డబ్బుల వివాదం, మద్యం మత్తు, క్షణికావేశం కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వేగంగా కేసును ఛేదించడం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.Location :Chittoor,Chittoor,Andhra PradeshFirst Published :Jul 14, 2026 10:44 PM ISTమరింత చదవండి

Source link