ఈ విషయాలపై ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్ బ్రెస్ట్ సర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్వేతా రాజ్దాన్ వివరాలు వెల్లడించారు.
డెన్స్ బ్రెస్ట్ అంటే ఏమిటి?
సాధారణంగా చెప్పాలంటే బ్రెస్ట్‌లో ఉండే టిష్యూ పరిమాణాన్ని బట్టి దాని డెన్సిటీని నిర్ణయిస్తారు. బ్రెస్ట్‌లో ప్రధానంగా కొవ్వు (ఫ్యాట్), గ్రంధి సంబంధిత టిష్యూ (గ్లాండ్యులర్ టిష్యూ) ఉంటాయి. ఈ గ్లాండ్యులర్ టిష్యూలోనే పాల ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. బ్రెస్ట్‌లో గ్లాండ్యులర్ టిష్యూ ఎక్కువగా ఉంటే దాన్ని డెన్స్ బ్రెస్ట్ అంటారు. అదే కొవ్వు టిష్యూ ఎక్కువగా ఉంటే తక్కువ డెన్సిటీ ఉన్న బ్రెస్ట్గా పరిగణిస్తారు.
మామోగ్రామ్ రిపోర్టులో ‘డెన్స్ బ్రెస్ట్’ అని ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉందని అర్థం కాదని డాక్టర్ శ్వేతా రాజ్దాన్ తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులో మహిళల్లో గ్లాండ్యులర్ టిష్యూ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల 40 ఏళ్లలోపు మహిళల్లో మామోగ్రామ్ చేసినప్పుడు డెన్స్ బ్రెస్ట్ కనిపించవచ్చని ఆమె వివరించారు.
డెన్స్ బ్రెస్ట్‌తో క్యాన్సర్‌కు సంబంధం ఉందా?
బ్రెస్ట్ డెన్సిటీ అనేది క్యాన్సర్ ఉందని నిర్ధారించే లక్షణం కాదు. అయితే డెన్స్ బ్రెస్ట్ ఉన్నప్పుడు మామోగ్రామ్‌లో కొన్ని మార్పులను గుర్తించడం కొంత క్లిష్టంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మామోగ్రామ్‌లో బ్రెస్ట్‌లోని టిష్యూ వివిధ షేడ్స్‌లో కనిపిస్తుంది. గ్లాండ్యులర్ టిష్యూ సాధారణంగా తెల్లగా కనిపిస్తుంది. కొన్ని బ్రెస్ట్ ట్యూమర్లు తెల్లగా కనిపించవచ్చు. దీంతో గ్లాండ్యులర్ టిష్యూ ఎక్కువగా ఉన్న డెన్స్ బ్రెస్ట్‌లో ట్యూమర్ ఉంటే దాన్ని గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా మారవచ్చు.
అంటే డెన్స్ బ్రెస్ట్ ఉన్న ప్రతి మహిళకు క్యాన్సర్ వస్తుందని కాదు. అయితే అధిక డెన్సిటీ ఉన్న సందర్భాల్లో మామోగ్రామ్‌లో కొన్ని అసాధారణ మార్పులు కనిపించకుండా ఉండే అవకాశం ఉండటంతో వైద్యులు అవసరాన్ని బట్టి అదనపు పరీక్షలను సూచించవచ్చు.
మామోగ్రామ్ రిపోర్టులో డెన్స్ బ్రెస్ట్ అని వచ్చినప్పుడు ప్రతి మహిళ తప్పనిసరిగా అదనపు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదని డాక్టర్ తెలిపారు. పరిస్థితిని బట్టి వైద్యులు అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలను సూచించవచ్చు.
మొదటిసారి మామోగ్రామ్ చేయించుకుంటున్న మహిళకు అవసరమని భావిస్తే అల్ట్రాసౌండ్ను కూడా సూచించవచ్చు. అయితే గతంలో ఒకటి లేదా రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్ చేయించుకుంటూ ఉంటే.. ప్రస్తుత రిపోర్టును పాత రిపోర్టులతో పోల్చి చూడవచ్చు. ప్రతిసారి కొత్తగా అల్ట్రాసౌండ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని నిపుణులు తెలిపారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్‌లోని గ్లాండ్యులర్ టిష్యూ పరిమాణం తగ్గి, కొవ్వు టిష్యూ పెరగవచ్చు. దీంతో బ్రెస్ట్ డెన్సిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
డెన్స్ బ్రెస్ట్ ఉన్న మహిళలు తమ వయసు, కుటుంబ చరిత్ర, గత పరీక్షల ఫలితాలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సూచన మేరకు స్క్రీనింగ్ చేయించుకోవాలి. మామోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలి, అదనంగా అల్ట్రాసౌండ్ అవసరమా లేదా వంటి విషయాలను వ్యక్తిగత పరిస్థితిని బట్టి వైద్యులే నిర్ణయించాలి.
ముఖ్యంగా: మామోగ్రామ్ రిపోర్టులో ‘డెన్స్ బ్రెస్ట్’ అని రావడం ఒక్కటే క్యాన్సర్‌కు నిర్ధారణ కాదు. రిపోర్టును చూసి భయపడకుండా, దానిని వైద్య నిపుణుడికి చూపించి తదుపరి పరీక్షలు అవసరమా లేదా తెలుసుకోవడం మంచిది.
