ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని జల్పల్లి ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, విశాలమైన తోటలు, రిసార్ట్‌ను తలపించే నిర్మాణం ఈ ఇంటి ప్రత్యేకత. మోహన్‌బాబు కుమార్తె, నటి లక్ష్మీ మంచు తన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. “ఇది మా నాన్నగారి ఆరో ఇల్లు. చెన్నైలో రెండు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించారు” అని ఆమె తెలిపారు.

