ప్రభన్యూస్

ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ప్లాంట్.. రూ.3,293 కోట్లతో భారీ ప్రాజెక్ట్ | Premier Energies Commissions Rs 3293 Crore Solar Cell Plant in AP | బిజినెస్


Last Updated:

ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో 7 GW సోలార్ సెల్ ప్లాంట్‌ను ప్రారంభించింది. దీంతో మొత్తం సామర్థ్యం 10.6 GWకి చేరింది. ఇది దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్.

ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ప్లాంట్.. రూ.3,293 కోట్లతో భారీ ప్రాజెక్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ప్లాంట్.. రూ.3,293 కోట్లతో భారీ ప్రాజెక్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్‌లో భారీ సోలార్ సెల్ తయారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంట్‌తో కంపెనీ సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు పెరిగింది. దేశంలో సోలార్ సెల్స్ తయారీలో ఇది అతిపెద్ద ప్లాంట్ అని కంపెనీ తెలిపింది. ప్రీమియర్ ఎనర్జీస్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించిందని పీటీఐ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంతో తమ మొత్తం సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు చేరిందని చెప్పింది. ఈ ప్లాంట్ 101 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం కంపెనీ రూ.3,293 కోట్లు పెట్టుబడి పెట్టింది. దేశంలోనే ఇది అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంట్‌లో 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న ఎన్-టైప్ టాప్‌కాన్ జీ12ఆర్ సోలార్ సెల్ తయారీ సదుపాయం ఉంది. దీంతో ప్రీమియర్ ఎనర్జీస్ మొత్తం సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు పెరిగింది. టన్నెల్ ఆక్సైడ్ ప్యాసివేటెడ్ కాంటాక్ట్ (టాప్‌కాన్) అనేది ఆధునిక సోలార్ సెల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ మాడ్యూల్స్ తయారు చేయవచ్చు. కొత్త ప్లాంట్‌లో గంటకు సుమారు 88,000 సోలార్ సెల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉంది.

ఇది కూడా చదవండి: SBI Solar Loan: వ్యాపారులకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్… సోలార్ ప్లాంట్ల కోసం ఈజీగా లోన్స్!

“ఈ సామర్థ్యం పెంపు చాలా కీలకం. దీని వల్ల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరింత స్థిరమైన సరఫరాతో, మెరుగైన ఆపరేటింగ్ సామర్థ్యంతో సేవలు అందించగలుగుతాం” అని ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలూజా చెప్పారు. సోలార్ తయారీ రంగంలో తమ పూర్తి విలువ చైన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ మరో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా 10 గిగావాట్ల ఇంగాట్ ప్రాజెక్ట్, 10 గిగావాట్ల వేఫర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తోంది.

ఇది కూడా చదవండి: EPFO Limit: ఈపీఎఫ్ లిమిట్ రూ.25,000కి పెంపు… మీ జీతం, పెన్షన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

సోలార్ ప్యానెల్‌లో మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్‌లో సోలార్ సెల్స్ ఉంటాయి. సెల్స్ తయారు చేయడానికి ఇంగాట్ అవసరం. ఇంగాట్ నుంచి వేఫర్లు తయారవుతాయి. అంటే సోలార్ ప్యానెల్ తయారీలో ఇంగాట్, వేఫర్, సెల్, మాడ్యూల్ ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానమైన దశలు ఉంటాయి. మొత్తంగా చూస్తే, నాయుడుపేటలో కొత్త 7 గిగావాట్ల ప్లాంట్ ప్రారంభంతో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు చేరింది. అలాగే ఇంగాట్, వేఫర్ తయారీ ప్రాజెక్ట్‌లపై కూడా కంపెనీ దృష్టి పెట్టింది. దీంతో సోలార్ తయారీకి అవసరమైన పలు దశలను ఒకే విలువ చైన్‌లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 11:08 am Digital Edition : Prabhanews
ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ప్లాంట్.. రూ.3,293 కోట్లతో భారీ ప్రాజెక్ట్ | Premier Energies Commissions Rs 3293 Crore Solar Cell Plant in AP | బిజినెస్

Last Updated:Sep 21, 2026 10:54 AM ISTప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో 7 GW సోలార్ సెల్ ప్లాంట్‌ను ప్రారంభించింది. దీంతో మొత్తం సామర్థ్యం 10.6 GWకి చేరింది. ఇది దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్.ఏపీలో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ప్లాంట్.. రూ.3,293 కోట్లతో భారీ ప్రాజెక్ట్ (ప్రతీకాత్మక చిత్రం)ఆంధ్రప్రదేశ్‌లో భారీ సోలార్ సెల్ తయారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంట్‌తో కంపెనీ సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు పెరిగింది. దేశంలో సోలార్ సెల్స్ తయారీలో ఇది అతిపెద్ద ప్లాంట్ అని కంపెనీ తెలిపింది. ప్రీమియర్ ఎనర్జీస్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించిందని పీటీఐ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంతో తమ మొత్తం సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు చేరిందని చెప్పింది. ఈ ప్లాంట్ 101 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం కంపెనీ రూ.3,293 కోట్లు పెట్టుబడి పెట్టింది. దేశంలోనే ఇది అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంట్‌లో 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న ఎన్-టైప్ టాప్‌కాన్ జీ12ఆర్ సోలార్ సెల్ తయారీ సదుపాయం ఉంది. దీంతో ప్రీమియర్ ఎనర్జీస్ మొత్తం సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు పెరిగింది. టన్నెల్ ఆక్సైడ్ ప్యాసివేటెడ్ కాంటాక్ట్ (టాప్‌కాన్) అనేది ఆధునిక సోలార్ సెల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ మాడ్యూల్స్ తయారు చేయవచ్చు. కొత్త ప్లాంట్‌లో గంటకు సుమారు 88,000 సోలార్ సెల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉంది.ఇది కూడా చదవండి: SBI Solar Loan: వ్యాపారులకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్... సోలార్ ప్లాంట్ల కోసం ఈజీగా లోన్స్!"ఈ సామర్థ్యం పెంపు చాలా కీలకం. దీని వల్ల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరింత స్థిరమైన సరఫరాతో, మెరుగైన ఆపరేటింగ్ సామర్థ్యంతో సేవలు అందించగలుగుతాం" అని ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలూజా చెప్పారు. సోలార్ తయారీ రంగంలో తమ పూర్తి విలువ చైన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ మరో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా 10 గిగావాట్ల ఇంగాట్ ప్రాజెక్ట్, 10 గిగావాట్ల వేఫర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తోంది.ఇది కూడా చదవండి: EPFO Limit: ఈపీఎఫ్ లిమిట్ రూ.25,000కి పెంపు... మీ జీతం, పెన్షన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?సోలార్ ప్యానెల్‌లో మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్‌లో సోలార్ సెల్స్ ఉంటాయి. సెల్స్ తయారు చేయడానికి ఇంగాట్ అవసరం. ఇంగాట్ నుంచి వేఫర్లు తయారవుతాయి. అంటే సోలార్ ప్యానెల్ తయారీలో ఇంగాట్, వేఫర్, సెల్, మాడ్యూల్ ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానమైన దశలు ఉంటాయి. మొత్తంగా చూస్తే, నాయుడుపేటలో కొత్త 7 గిగావాట్ల ప్లాంట్ ప్రారంభంతో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 10.6 గిగావాట్లకు చేరింది. అలాగే ఇంగాట్, వేఫర్ తయారీ ప్రాజెక్ట్‌లపై కూడా కంపెనీ దృష్టి పెట్టింది. దీంతో సోలార్ తయారీకి అవసరమైన పలు దశలను ఒకే విలువ చైన్‌లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.మరింత చదవండి

Source link