Last Updated:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మోదీని మంచి మిత్రుడిగా అభివర్ణించిన ఆమె, ఇరు దేశాల స్నేహబంధం మరింత బలపడాలని మనసారా ఆకాంక్షించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రనేతల నుంచి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మోదీని తన అత్యుత్తమ స్నేహితుడిగా పేర్కొన్న మెలోనీ.. ఆయనకు ఆయురారోగ్యాలు, అపారమైన శక్తి సామర్థ్యాలు, విజయాలు దక్కాలని మనసారా కోరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు అత్యంత లోతైన స్నేహబంధాన్ని నిరంతరం పంచుకుంటున్నాయని ఆమె గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ రెండు దేశాలు పరస్పర సహకారంతో ఉమ్మడిగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే నెలలో ఇటలీలో పర్యటించిన మోదీ, మెలోనీతో కలిసి కీలక చర్చలు జరిపారు. ఆ సమయంలో ఇరు దేశాల సంబంధాలు ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ స్థాయికి చేరడం విశేషం.
Buon compleanno al mio amico @narendramodi, a cui auguro salute, energia e successo.
Italia e India continuano a rafforzare il loro profondo legame di amicizia, costruendo insieme un futuro di cooperazione e prosperità per le nostre Nazioni.
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2026
మెలోనీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రధాని మోదీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి ఉన్న గొప్ప గౌరవాన్ని, ఆయన ప్రభావాన్ని పుతిన్ ప్రత్యేకంగా కొనియాడారు. రష్యా, భారత్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ వ్యక్తిగత కృషి ఎనలేనిదని ప్రశంసించారు.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
స్వదేశంలో తోటి భారతీయుల నుంచి మోదీ పొందుతున్న అపారమైన గౌరవం, మద్దతు ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, భద్రతలను నెలకొల్పడంలో రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్లోబల్ లీడర్ల నుంచి వస్తున్న ఈ ప్రశంసలు అంతర్జాతీయ స్థాయిలో మోదీ సాధించిన దౌత్య విజయాలకు అద్దం పడుతున్నాయి.

