ప్రభన్యూస్

Wisdom Teeth: జ్ఞాన దంతం వస్తే తీసేయాల్సిందేనా.. ఈ విషయం తెలిస్తే మీ నిర్ణయం మారొచ్చు..! wisdom tooth when to remove when to keep. | లైఫ్ స్టైల్


Last Updated:

జ్ఞాన దంతం ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ఉంచాలి అనే దానిపై విశాఖపట్నం స్మైల్ ఆస్పటల్ దంత వైద్యులు ప్రవీణ్ కుమార్ వివరించారు. నొప్పి, ఇన్ఫెక్షన్ లేకపోతే ఉంచుకోవచ్చు.

News18
News18

జ్ఞాన దంతం వస్తుందంటే చాలు.. ఇక దాన్ని తీసేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ వర్తించదని విశాఖపట్నానికి స్మైల్ ఆస్పటల్ దంత వైద్యులు ప్రవీన్ కుమార్ తెలిపారు. కొందరిలో జ్ఞాన దంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిగ్గా పెరుగుతుంది. మరికొందరిలో మాత్రం నోటిలో స్థలం సరిపోకపోవడంతో వంకరగా రావడం, చిగుళ్లలోనే ఇరుక్కుపోవడం జరుగుతుందని వైద్యులు వివరించారు. అసలు జ్ఞాన దంతం ఎప్పుడు తొలగించాలి? ఎప్పుడు అలాగే ఉంచుకోవచ్చు? అనే విషయంలో ఆయన కొన్ని విషయాలు చెబుతున్నారు.

సాధారణంగా జ్ఞాన దంతాలు 17 నుంచి 25 ఏళ్ల మధ్య బయటకు వస్తాయి. ఇవి నోటిలో చివరి వరుసలో ఉండే దంతాలు. పూర్వకాలంలో మనుషులు ఎక్కువగా గట్టి, పచ్చి ఆహారం తీసుకునేవారు కాబట్టి ఈ దంతాలు నమలడంలో ఉపయోగపడేవి. అయితే కాలక్రమేణా ఆహారపు అలవాట్లు మారడం, మానవుల దవడ పరిమాణం తగ్గడంతో చాలామందికి జ్ఞాన దంతం పెరగడానికి సరిపడా స్థలం లేకుండా పోయింది.

స్థలం తక్కువగా ఉన్నప్పుడు జ్ఞాన దంతం సరిగ్గా పైకి రావడం కష్టమవుతుంది. కొన్నిసార్లు పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది.. మరికొన్ని సందర్భాల్లో పక్కకు వంగి పెరుగుతుంది లేదా చిగుళ్లలో పూర్తిగా చిక్కుకుపోతుందని వైద్యులు వివరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆహారం పేరుకుపోయి శుభ్రం చేయడం కష్టమవుతుంది. ఫలితంగా చిగుళ్ల వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో నోరు పూర్తిగా తెరవడం లేదా ఆహారం నమలడం కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు.

అయితే జ్ఞాన దంతం ఉందంటే వెంటనే తొలగించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అది నిటారుగా ఉండి, సరైన స్థానంలో పెరిగి, బ్రష్‌తో సులభంగా శుభ్రం చేసుకోగలిగితే అలాగే ఉంచుకోవచ్చు. ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్ లేకపోవడంతో పాటు పక్కనున్న దంతాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకపోతే దంతవైద్యుడు దాన్ని తొలగించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

మరోవైపు తరచూ నొప్పి రావడం, చిగుళ్లు వాపు రావడం, ఇన్ఫెక్షన్ ఏర్పడటం, దంతం పుచ్చిపోవడం లేదా పక్కనున్న దంతానికి నష్టం కలిగే పరిస్థితి ఉంటే తొలగించడం అవసరం కావచ్చు. దంతం చిగుళ్లలో పూర్తిగా ఇరుక్కుపోయినప్పుడు కూడా సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దంతవైద్యులు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ద్వారా జ్ఞాన దంతాన్ని తొలగిస్తారని వైద్యులు అంటున్నారు.

అందుకే జ్ఞాన దంతం కనిపించగానే భయపడి తీసేయడం లేదా నొప్పి ఉన్నా పట్టించుకోకుండా వదిలేయడం రెండూ సరైనవి కావని వైద్యులు చెబుతున్నారు. దంతం ఏ స్థితిలో ఉంది, పక్క దంతాలపై ప్రభావం ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా వంటి విషయాలను దంతవైద్యుడు పరీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే ఎక్స్‌రే ద్వారా దంతం చిగుళ్లలో ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాన దంతం విషయంలో తుది నిర్ణయం వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 10:23 pm Digital Edition : Prabhanews
Wisdom Teeth: జ్ఞాన దంతం వస్తే తీసేయాల్సిందేనా.. ఈ విషయం తెలిస్తే మీ నిర్ణయం మారొచ్చు..! wisdom tooth when to remove when to keep. | లైఫ్ స్టైల్

Last Updated:Sep 15, 2026 10:19 PM ISTజ్ఞాన దంతం ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ఉంచాలి అనే దానిపై విశాఖపట్నం స్మైల్ ఆస్పటల్ దంత వైద్యులు ప్రవీణ్ కుమార్ వివరించారు. నొప్పి, ఇన్ఫెక్షన్ లేకపోతే ఉంచుకోవచ్చు.News18జ్ఞాన దంతం వస్తుందంటే చాలు.. ఇక దాన్ని తీసేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ వర్తించదని విశాఖపట్నానికి స్మైల్ ఆస్పటల్ దంత వైద్యులు ప్రవీన్ కుమార్ తెలిపారు. కొందరిలో జ్ఞాన దంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిగ్గా పెరుగుతుంది. మరికొందరిలో మాత్రం నోటిలో స్థలం సరిపోకపోవడంతో వంకరగా రావడం, చిగుళ్లలోనే ఇరుక్కుపోవడం జరుగుతుందని వైద్యులు వివరించారు. అసలు జ్ఞాన దంతం ఎప్పుడు తొలగించాలి? ఎప్పుడు అలాగే ఉంచుకోవచ్చు? అనే విషయంలో ఆయన కొన్ని విషయాలు చెబుతున్నారు.సాధారణంగా జ్ఞాన దంతాలు 17 నుంచి 25 ఏళ్ల మధ్య బయటకు వస్తాయి. ఇవి నోటిలో చివరి వరుసలో ఉండే దంతాలు. పూర్వకాలంలో మనుషులు ఎక్కువగా గట్టి, పచ్చి ఆహారం తీసుకునేవారు కాబట్టి ఈ దంతాలు నమలడంలో ఉపయోగపడేవి. అయితే కాలక్రమేణా ఆహారపు అలవాట్లు మారడం, మానవుల దవడ పరిమాణం తగ్గడంతో చాలామందికి జ్ఞాన దంతం పెరగడానికి సరిపడా స్థలం లేకుండా పోయింది.స్థలం తక్కువగా ఉన్నప్పుడు జ్ఞాన దంతం సరిగ్గా పైకి రావడం కష్టమవుతుంది. కొన్నిసార్లు పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది.. మరికొన్ని సందర్భాల్లో పక్కకు వంగి పెరుగుతుంది లేదా చిగుళ్లలో పూర్తిగా చిక్కుకుపోతుందని వైద్యులు వివరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆహారం పేరుకుపోయి శుభ్రం చేయడం కష్టమవుతుంది. ఫలితంగా చిగుళ్ల వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో నోరు పూర్తిగా తెరవడం లేదా ఆహారం నమలడం కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు.అయితే జ్ఞాన దంతం ఉందంటే వెంటనే తొలగించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అది నిటారుగా ఉండి, సరైన స్థానంలో పెరిగి, బ్రష్‌తో సులభంగా శుభ్రం చేసుకోగలిగితే అలాగే ఉంచుకోవచ్చు. ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్ లేకపోవడంతో పాటు పక్కనున్న దంతాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకపోతే దంతవైద్యుడు దాన్ని తొలగించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.మరోవైపు తరచూ నొప్పి రావడం, చిగుళ్లు వాపు రావడం, ఇన్ఫెక్షన్ ఏర్పడటం, దంతం పుచ్చిపోవడం లేదా పక్కనున్న దంతానికి నష్టం కలిగే పరిస్థితి ఉంటే తొలగించడం అవసరం కావచ్చు. దంతం చిగుళ్లలో పూర్తిగా ఇరుక్కుపోయినప్పుడు కూడా సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దంతవైద్యులు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ద్వారా జ్ఞాన దంతాన్ని తొలగిస్తారని వైద్యులు అంటున్నారు.అందుకే జ్ఞాన దంతం కనిపించగానే భయపడి తీసేయడం లేదా నొప్పి ఉన్నా పట్టించుకోకుండా వదిలేయడం రెండూ సరైనవి కావని వైద్యులు చెబుతున్నారు. దంతం ఏ స్థితిలో ఉంది, పక్క దంతాలపై ప్రభావం ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా వంటి విషయాలను దంతవైద్యుడు పరీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే ఎక్స్‌రే ద్వారా దంతం చిగుళ్లలో ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాన దంతం విషయంలో తుది నిర్ణయం వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.మరింత చదవండి

Source link