Last Updated:
రూ.20 లక్షల ముద్రా లోన్ మంజూరైందంటూ ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రుణాన్ని పొందేందుకు ముందుగా రూ.3,250ను ‘అగ్రిమెంట్ ఛార్జెస్’ పేరుతో చెల్లించాలని అందులో కోరుతున్నారు. దీనిపై PIB Fact Check అలర్ట్ చేస్తూ, ఇలాంటి నకిలీ లేఖలను నమ్మి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని సూచించింది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పేరుతో ఫేక్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లేఖలో ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రూ.20 లక్షల రుణం మంజూరైనట్లు పేర్కొంటూ, దాన్ని పొందేందుకు ముందుగా రూ.3,250ను ‘అగ్రిమెంట్ ఛార్జెస్’ పేరుతో చెల్లించాలని కోరుతున్నారు. ఇలాంటి లేఖలు, మెసేజ్‌లు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన PIB Fact Check హెచ్చరించింది.

