గోల్డ్ లోన్ వడ్డీ రేటు బ్యాంకును బట్టి, లోన్ పథకాన్ని బట్టి మారుతుంది. బ్యాంకు, తీసుకునే లోన్ మొత్తం, తిరిగి చెల్లించే విధానం, లోన్ కాలం, లోన్ తీసుకునే ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేటు మారవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం ఎస్‌బీఐలో 9.15 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 9 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో 8.55 శాతం నుంచి గోల్డ్ లోన్స్ ప్రారంభం అవుతాయి. గోల్డ్ లోన్‌కు బంగారు నగలు తాకట్టుగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు తాకట్టు లేని పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ వడ్డీ తక్కువగా ఉండొచ్చు. అయితే వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. ప్రాసెసింగ్ ఫీజు, వాల్యుయేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇతర వర్తించే ఖర్చులు కలిపితే మొత్తం లోన్ ఖర్చు పెరగొచ్చు. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే ముందు బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఛార్జీలు, రీపేమెంట్ నిబంధనలు తప్పకుండా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)

