Last Updated:
Bricks 2026: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సదస్సు వివిధ అంతర్జాతీయ అంశాలపై అర్థవంతమైన చర్చలకు మార్గం సుగమం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
Bricks 2026: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సదస్సు వివిధ అంతర్జాతీయ అంశాలపై అర్థవంతమైన చర్చలకు మార్గం సుగమం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “రాబోయే రెండు రోజుల్లో ప్రపంచ దేశాల అధినేతలు బ్రిక్స్ సదస్సు కోసం ఇక్కడ సమావేశం కానున్నారు. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కీలక అంశాలపై ఈ సదస్సు సానుకూల, అర్థవంతమైన చర్చలకు దారితీస్తుందని మేము విశ్వసిస్తున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

