తదుపరి వేతన సవరణకు సంబంధించిన సిఫార్సులు సిద్ధం చేసే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్న 8వ కేంద్ర వేతన సంఘం ఇప్పుడు చెన్నై, పుదుచ్చేరిలో సంప్రదింపుల తేదీలను ప్రకటించిందని సీఎన్బీసీటీవీ18 వెల్లడించింది. వేతన సంఘం జారీ చేసిన నోటీసుల ప్రకారం, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చెన్నైలో, సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో వేతన సంఘంతో మాట్లాడాలని కోరుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, సంఘాలు, యూనియన్లు ఆగస్టు 18లోపు ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే తమ మెమోరాండం సమర్పించిన తర్వాత వచ్చిన ప్రత్యేక మెమో ఐడీని కూడా జత చేయాలని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

