Last Updated:
హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కొత్త హై ప్రోటీన్ పెరుగు లాంఛ్ అయింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను సులభంగా పెంచుకునేలా హెరిటేజ్ ఫుడ్స్ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా రూపొందించిన నౌరిష్+ హై ప్రోటీన్ కర్డ్‌ను కంపెనీ విడుదల చేసింది. భారత్‌లో ప్రముఖ లిస్టెడ్ డెయిరీ కంపెనీల్లో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తుల నౌరిష్+ శ్రేణిని మరింత విస్తరిస్తూ ఈ కొత్త పెరుగును మార్కెట్లోకి తీసుకొచ్చింది. నౌరిష్+ హై ప్రోటీన్ కర్డ్‌లో 400 గ్రాముల ప్యాక్‌కు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇప్పటికే రోజువారీ ఆహారంలో పెరుగు తినే వారికి అదనంగా ప్రోటీన్ తీసుకోవడం సులభం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. సాధారణంగా హై ప్రోటీన్ ఫుడ్స్‌లో రుచి లేదా టెక్స్చర్ విషయంలో కొంత రాజీ పడాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త పెరుగులో ఆ సమస్య లేకుండా చూసినట్లు హెరిటేజ్ ఫుడ్స్ చెబుతోంది. 25 గ్రాముల ప్రోటీన్‌తో పాటు మంచి పెరుగులో ఉండే చిక్కటి, క్రీమీ రుచి, టెక్స్చర్ను కూడా నిలబెట్టారు.

