Telangana: హైదరాబాద్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి.. చాక్లెట్ ఇస్తానని చెప్పి నయ వంచన | తెలంగాణ వార్తలు
పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబంతో పరిచయం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ కేపీహెచ్‌బీ ప్రాంతంలో బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తరచూ ఆ ప్రాంతంలో ఉండటంతో కుటుంబ సభ్యులకు కూడా అతను తెలిసిన వ్యక్తిగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాన్నే ఆసరాగా చేసుకుని బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మే నెలలో జరిగిన ఘటన పోలీసుల కథనం…
