Last Updated:
Iron Deficiency: కొద్దిగా నడిచినా ఆయాసం వస్తోందా, చేతి గోళ్లు విరిగిపోతున్నాయా? శరీరంలో రక్తం పడిపోవడానికి సంకేతమైన హీమోగ్లోబిన్ లోపం, మెదడుకు ఆక్సిజన్ తగ్గించే ఐరన్ డెఫిషియెన్సీపై వైద్యులు ఏం చెబుతున్నారు?
Iron Deficiency: మన శరీరం ఆరోగ్యంగా, యాక్టివ్ గా పనిచేయడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజ లవణాలలో ‘ఐరన్’ (ఇనుము) మొదటి వరుసలో ఉంటుంది. రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉండే ‘హీమోగ్లోబిన్’ తయారీకి ఐరన్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ హీమోగ్లోబిన్ మాత్రమే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ను తీసుకుని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ మోతాదు తగ్గితే.. హీమోగ్లోబిన్ ఉత్పత్తి పడిపోయి రక్తహీనత వ్యాధి సంభవిస్తుంది. ప్రస్తుత కాలంలో తప్పుడు ఆహార అలవాట్ల వల్ల ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఈ ఐరన్ లోపం బారిన పడుతున్నారు. ప్రారంభంలోనే గుర్తించకపోతే కాలేయం, గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీరంలో ఐరన్ డెఫిషియెన్సీ ఉన్నప్పుడు కనిపించే ఆ 5 ప్రధాన లక్షణాల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
ఐరన్ లోపం ఉన్నప్పుడు కనిపించే అన్నిటికంటే మొదటి, అతి సాధారణ లక్షణం ఇది. శరీర కణాలకు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు.. బాడీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. దీనివల్ల రాత్రి పూట ఎంత బాగా నిద్రపోయినా సరే.. ఉదయం లేచినప్పటి నుండి రోజంతా విపరీతమైన నీరసం, అలసట ఆవహిస్తాయి. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా శరీరం అస్సలు సహకరించదు.
హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు.. శరీర అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి ఊపిరితిత్తులు, గుండె సాధారణం కంటే ఎక్కువ వేగంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కేవలం నాలుగు అడుగులు నడిచినా లేదా రెండు మెట్లు ఎక్కినా సరే హఠాత్తుగా ఊపిరి అందనట్లు అయిపోతుంది, విపరీతమైన ఆయాసం వస్తుంది.
రక్తం పర్ఫెక్ట్ గా ఉన్నవారి చర్మం ఆరోగ్యకరమైన గులాబీ లేదా ఎరుపు రంగు కాంతితో మెరుస్తుంది. ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల చర్మానికి ఆ సహజమైన రంగు అందదు. ఫలితంగా ముఖం, కళ్ల కింది భాగం, గోళ్లు, అరచేతులు, నాలుక సాధారణం కంటే భిన్నంగా తెల్లగా లేదా పాలిపోయినట్లు (Pale) విచిత్రమైన రంగులోకి మారుతాయి.
శరీరంలో ఐరన్ కొరత ఏర్పడినప్పుడు మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ సరఫరా నెమ్మదిస్తుంది. ఆక్సిజన్ అందక మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోతాయి. దీనివల్ల నిరంతరం మైగ్రేన్ లేదా తలనొప్పి వేధిస్తుంటుంది. హఠాత్తుగా కూర్చుని లేచినప్పుడు కళ్లు తిరగడం, కళ్ల ముందు చీకట్లు కమ్మడం లాంటివి జరుగుతాయి.
జుట్టు కుదుళ్లకు, గోళ్లకు పెరగడానికి అవసరమైన ఆక్సిజన్, న్యూట్రియంట్లు రక్తం ద్వారానే అందుతాయి. ఐరన్ లోపించినప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడి.. దువ్వెన పెడితే చాలు గుత్తులు గుత్తులుగా జుట్టు రాలిపోతుంది. చేతి గోళ్లు కూడా చాలా సాఫ్ట్ గా మారి చెంచా ఆకారంలోకి వంగిపోవడం లేదా త్వరగా విరిగిపోవడం జరుగుతుంది.
ఆకుకూరలు – తోటకూర… మీ రోజువారీ డైట్ లో తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలను క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. వీటిలో ఐరన్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్… ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర పండ్లను తినడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ చాలా వేగంగా పెరుగుతాయి.
విటమిన్ సి కాంబినేషన్… ఐరన్ ఉన్న ఆహారాలు తిన్నప్పుడు.. శరీరం దాన్ని పర్ఫెక్ట్ గా అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ సి అవసరం. కాబట్టి మీ భోజనంతో పాటు కొద్దిగా నిమ్మరసం లేదా నారింజ పండ్లను తీసుకోవడం మర్చిపోవద్దు.
Hyderabad,Telangana
Jul 12, 2026 10:16 AM IST

