Last Updated:
Jio IPO 2026: భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ చారిత్రాత్మక స్థాయిలో ముగిసింది. ఈ ఐపీఓకు మొత్తం సుమారు రూ.7.40 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే ఏ ఐపీఓకూ రానన్ని దరఖాస్తులు జియో ఐపీఓకు రావడం విశేషం. మూడు రోజుల పాటు సాగిన ఈ పబ్లిక్ ఇష్యూకు ఏకంగా 1.38 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల దరఖాస్తుల విషయంలో జియో సరికొత్త రికార్డు సృష్టించింది.
Jio IPO 2026: భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ చారిత్రాత్మక స్థాయిలో ముగిసింది. ఈ ఐపీఓకు మొత్తం సుమారు రూ.7.40 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే ఏ ఐపీఓకూ రానన్ని దరఖాస్తులు జియో ఐపీఓకు రావడం విశేషం. మూడు రోజుల పాటు సాగిన ఈ పబ్లిక్ ఇష్యూకు ఏకంగా 1.38 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల దరఖాస్తుల విషయంలో జియో సరికొత్త రికార్డు సృష్టించింది.
రూ.30,213 కోట్ల విలువైన జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు శుక్రవారం (అక్టోబర్ 23, 2026) సాయంత్రం 7 గంటలకు బిడ్డింగ్ ముగిసే సమయానికి 22 రెట్లకు పైగా సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన సుమారు రూ.2.50 లక్షల కోట్ల బిడ్లతో కలిపి మొత్తం డిమాండ్ రూ.7.40 లక్షల కోట్లకు చేరింది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లను మినహాయిస్తే ఇతర ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.4.90 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
జియో ఐపీఓపై రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గణనీయమైన ఆసక్తి చూపించారు. రిటైల్ విభాగానికి సుమారు 8.5 కోట్ల షేర్లను కేటాయించగా వాటి కోసం 23 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఈ విభాగం 2.72 రెట్లు సబ్స్క్రైబ్ అయింది.
అయితే ఐపీఓకు ఎంత మేర సబ్స్క్రిప్షన్ వచ్చిందనే దానిపైనే షేర్ల కేటాయింపు ఆధారపడి ఉండదు. చెల్లుబాటయ్యే దరఖాస్తులు, కనీస లాట్ పరిమాణం, వర్తించే కేటాయింపు విధానం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జియో ఐపీఓలో దరఖాస్తు చేసిన వారిలో ఎంతమందికి షేర్లు లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
జియో ఐపీఓకు వచ్చిన డిమాండ్లో సంస్థాగత పెట్టుబడిదారులు ముందంజలో నిలిచారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగం ఏకంగా 70.55 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) విభాగానికి 14 రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అర్హత కలిగిన వాటాదారుల కోసం కేటాయించిన విభాగం 7.60 రెట్లు సబ్స్క్రైబ్ కాగా, ఉద్యోగుల విభాగానికి 2.93 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 26న జరగనుంది. అక్టోబర్ 27న అర్హులైన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ కానున్నాయి. అనంతరం అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో ప్లాట్ఫామ్స్ షేర్లు లిస్ట్ కానున్నాయి.
ఇప్పటివరకు ఐపీఓ దరఖాస్తుల విషయంలో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న రికార్డును జియో అధిగమించింది. 2024 అక్టోబర్లో వారీ ఎనర్జీస్ ఐపీఓకు 97.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే, జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు 1.38 కోట్లకు పైగా దరఖాస్తులు రావడంతో ఆ రికార్డు బద్దలైంది. గత రికార్డుతో పోలిస్తే జియో ఐపీఓ దరఖాస్తుల సంఖ్య సుమారు 42 శాతం అధికంగా ఉంది. ఐపీఓ మొదటి రోజే సుమారు 30.5 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజు ముగిసే సమయానికి ఆ సంఖ్య 75 లక్షలు దాటింది. చివరి రోజున ఇన్వెస్టర్ల నుంచి మరింత వేగంగా స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.
జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ రికార్డు స్థాయిలో ముగిసిన రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ పుట్టినరోజు కూడా అక్టోబర్ 23నే కావడం విశేషం. ఒకవైపు ప్రపంచ రికార్డు స్థాయిలో దరఖాస్తులు, మరోవైపు భారీ బిడ్లతో జియో ఐపీఓ ముగియడం భారత క్యాపిటల్ మార్కెట్లో కీలక పరిణామంగా నిలిచింది.

