Tomatoes in Fridge: ఫ్రిజ్‌లో టమాటాలు పెట్టాలా? బయట ఉంచాలా? ఏ కూరగాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసా? |
గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సిన కూరగాయలు… బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తేమ వల్ల బూజు పట్టి మొలకలు వస్తాయి. ఈ కూరగాయలను కాంతి నేరుగా పడని, చల్లని, పొడిగా ఉండే ప్రదేశాల్లో గాలి ఆడే బుట్టల్లో నిల్వ చేయాలి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ ఒకే బుట్టలో కలిపి ఉంచకూడదు; ఉల్లి విడుదల చేసే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా…
