ప్రభన్యూస్

సోనమ్ వాంగ్‌చుక్‌కు విశాఖలో భారీ మద్దతు.. భీమ్ సేన ఆందోళనలో కేంద్రంపై తీవ్ర విమర్శలు..! Sonam Wangchuk movement. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా భీమ్ సేన సంఘీభావం తెలిపింది. నీట్ పేపర్ లీకేజీలపై రవి సిద్ధార్థ ఆందోళన వ్యక్తం చేశారు.

+

News18

News18

లడఖ్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా విశాఖపట్నంలో భారీ సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. భీమ్ సేన ఆధ్వర్యంలో నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో భీమ్ సేన నాయకులు, కార్యకర్తలు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (NEET) వంటి కీలక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ కావడం దేశ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షలకు సంబంధించిన వివాదాలు కూడా విద్యార్థుల్లో ఆందోళన పెంచాయని పేర్కొన్నారు.

పరీక్షా పత్రాల లీకేజీల కారణంగా వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని రవి సిద్ధార్థ అన్నారు. పేపర్ లీకేజీలతో మనస్తాపానికి గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి సమయంలో విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సంస్కరణల కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగుతున్న ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేలా పారదర్శక విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థుల హక్కులు, రాజ్యాంగబద్ధమైన విలువల పరిరక్షణ విషయంలో భీమ్ సేన ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన రవి సిద్ధార్థ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటే ప్రభుత్వం, విద్యా సంస్థలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేసిన భీమ్ సేన నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలు వెంటనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 July 2026, 10:07 am Digital Edition : Prabhanews
సోనమ్ వాంగ్‌చుక్‌కు విశాఖలో భారీ మద్దతు.. భీమ్ సేన ఆందోళనలో కేంద్రంపై తీవ్ర విమర్శలు..! Sonam Wangchuk movement. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 19, 2026 10:46 PM ISTవిశాఖలో సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా భీమ్ సేన సంఘీభావం తెలిపింది. నీట్ పేపర్ లీకేజీలపై రవి సిద్ధార్థ ఆందోళన వ్యక్తం చేశారు.+
News18లడఖ్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా విశాఖపట్నంలో భారీ సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. భీమ్ సేన ఆధ్వర్యంలో నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో భీమ్ సేన నాయకులు, కార్యకర్తలు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (NEET) వంటి కీలక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ కావడం దేశ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షలకు సంబంధించిన వివాదాలు కూడా విద్యార్థుల్లో ఆందోళన పెంచాయని పేర్కొన్నారు.పరీక్షా పత్రాల లీకేజీల కారణంగా వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని రవి సిద్ధార్థ అన్నారు. పేపర్ లీకేజీలతో మనస్తాపానికి గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సమయంలో విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సంస్కరణల కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగుతున్న ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేలా పారదర్శక విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల హక్కులు, రాజ్యాంగబద్ధమైన విలువల పరిరక్షణ విషయంలో భీమ్ సేన ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన రవి సిద్ధార్థ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటే ప్రభుత్వం, విద్యా సంస్థలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేసిన భీమ్ సేన నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలు వెంటనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.Location :Visakhapatnam,Visakhapatnam,Andhra PradeshFirst Published :Jul 19, 2026 10:46 PM ISTమరింత చదవండి

Source link