Last Updated:
Income Tax Myths | భారతదేశంలో ఆదాయపు పన్నుపై అనేక అపోహలున్నాయి. ఆ అపోహల వెనుక అసలు నిజాల గురించి హైదరాబాద్కు చెందిన సీఏ వివరించారు.
ఇండియాలో ఆదాయపు పన్ను గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులు, కుటుంబ చర్చలు, ఆఫీస్లో సహోద్యోగుల సలహాల ద్వారా ఇవి తరచూ ప్రచారంలోకి వస్తుంటాయి. కానీ వీటిలో చాలావరకు నిజం కాదు. కొన్ని అపోహలను నమ్మితే అదనంగా పన్ను చెల్లించాల్సి రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురవొచ్చు. భారతీయులు ఎక్కువగా నమ్మే 10 ఆదాయపు పన్ను అపోహలు ఏంటో, వాటి వెనుక ఉన్న అసలు నిజం ఏంటో హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ వివరించారు. మరి ఆ అపోహలు, వాటి వెనుక నిజాలు మీరూ తెలుసుకోండి.

