ప్రభన్యూస్

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే జీరో ట్యాక్స్.. అత్యంత ఆధునిక నగరంగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ | తెలంగాణ వార్తలు


Last Updated:

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుందని తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో రూ.60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్‌
ఫ్యూచర్ సిటీలో రూ.60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్‌

ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న అమెజాన్ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న “భారత్ ఫ్యూచర్ సిటీ” అభివృద్ధిలో అమెజాన్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఫ్యూచర్ సిటీలోకి మరిన్ని పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. ఫార్చూన్–500 జాబితాలో ఉన్న ప్రముఖ కంపెనీలను ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 108 దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం మంత్రులు, అధికారులు సమన్వయంతో నిరంతరం పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లతో ఏర్పడుతున్న అమెజాన్ డేటా సెంటర్ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి సాధ్యం కాదని పలువురు భావించారని, కానీ ప్రస్తుతం అక్కడ ఐటీ, ఫార్మా కంపెనీలు స్థాపించబడటంతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందని వివరించారు.

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాలంటే నగరంలోని కొన్ని పరిశ్రమలను బయటకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో మెట్రో రైలు విస్తరణ చేపట్టడంతో పాటు, ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సులను దశలవారీగా నగర శివార్లకు పరిమితం చేసి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే జీరో ట్యాక్స్ విధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై కూడా సీఎం తన లక్ష్యాలను వివరించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో తెలంగాణ వాటా కనీసం 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ లక్ష్యాలను సాధించాలంటే భారీ పెట్టుబడులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల విస్తరణ అత్యంత అవసరమని సీఎం అన్నారు. అందుకోసమే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీ రూపకల్పనలో ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేశామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

రాబోయే 14 ఏళ్లలో అమెజాన్ సుమారు 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉందని, అయితే రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అంతకంటే భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. 2034 నాటికి ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా అమెజాన్ సహా ఇతర సంస్థలు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, అవసరమైన సదుపాయాల కోసం మంత్రులు, అధికారులను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై తాను స్వయంగా తరచూ సమీక్షలు నిర్వహిస్తానని కూడా తెలిపారు.

ఒక రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాలు అత్యంత అవసరమని పేర్కొన్న సీఎం, అందుకే తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ, మెడికల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ వంటి పలు రంగాలకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2047లో భారత స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరిగే సమయానికి దేశ జీడీపీలో తెలంగాణ 10 శాతం వాటా సాధించేలా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 2:24 pm Digital Edition : Prabhanews
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే జీరో ట్యాక్స్.. అత్యంత ఆధునిక నగరంగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 3:06 PM ISTఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుందని తెలిపారు.ఫ్యూచర్ సిటీలో రూ.60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్‌ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న అమెజాన్ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న "భారత్ ఫ్యూచర్ సిటీ" అభివృద్ధిలో అమెజాన్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఫ్యూచర్ సిటీలోకి మరిన్ని పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. ఫార్చూన్–500 జాబితాలో ఉన్న ప్రముఖ కంపెనీలను ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 108 దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Groundbreaking Ceremony of Amazon Data Centre at Bharat Future City, Ranga Reddy District | AWS https://t.co/37DGJA0BNR
— Telangana CMO (@TelanganaCMO) July 15, 2026ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం మంత్రులు, అధికారులు సమన్వయంతో నిరంతరం పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లతో ఏర్పడుతున్న అమెజాన్ డేటా సెంటర్ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి సాధ్యం కాదని పలువురు భావించారని, కానీ ప్రస్తుతం అక్కడ ఐటీ, ఫార్మా కంపెనీలు స్థాపించబడటంతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందని వివరించారు.హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాలంటే నగరంలోని కొన్ని పరిశ్రమలను బయటకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో మెట్రో రైలు విస్తరణ చేపట్టడంతో పాటు, ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సులను దశలవారీగా నగర శివార్లకు పరిమితం చేసి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే జీరో ట్యాక్స్ విధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై కూడా సీఎం తన లక్ష్యాలను వివరించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో తెలంగాణ వాటా కనీసం 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ లక్ష్యాలను సాధించాలంటే భారీ పెట్టుబడులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల విస్తరణ అత్యంత అవసరమని సీఎం అన్నారు. అందుకోసమే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీ రూపకల్పనలో ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేశామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.రాబోయే 14 ఏళ్లలో అమెజాన్ సుమారు 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉందని, అయితే రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అంతకంటే భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. 2034 నాటికి ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా అమెజాన్ సహా ఇతర సంస్థలు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, అవసరమైన సదుపాయాల కోసం మంత్రులు, అధికారులను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై తాను స్వయంగా తరచూ సమీక్షలు నిర్వహిస్తానని కూడా తెలిపారు.ఒక రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాలు అత్యంత అవసరమని పేర్కొన్న సీఎం, అందుకే తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ, మెడికల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ వంటి పలు రంగాలకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2047లో భారత స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరిగే సమయానికి దేశ జీడీపీలో తెలంగాణ 10 శాతం వాటా సాధించేలా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link