మధ్యకాలంలో వెండి ధరల దిశ ప్రధానంగా అమెరికా ద్రవ్య విధానం, డాలర్ విలువ, ప్రపంచ తయారీ రంగం పనితీరు, పరిశ్రమల్లో వెండికి ఉన్న డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని యాదవ్ అభిప్రాయపడ్డారు. బాండ్ ఈల్డ్స్ తగ్గడం, వెండిపై పెట్టుబడులు మళ్లీ పెరగడం జరిగితే ధరలు కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగా ఉంటే ధరల పెరుగుదలకు పరిమితులు ఉండొచ్చని వివరించారు. దీర్ఘకాలంలో చూస్తే, క్లీన్ ఎనర్జీ, విద్యుదీకరణ, పారిశ్రామిక అవసరాల కోసం వెండికి పెరిగే డిమాండ్ దాని ధరలకు మద్దతు ఇవ్వొచ్చు. అయితే కొత్త సాంకేతికతలు రావడం, వెండికి బదులుగా ఇతర పదార్థాలను ఉపయోగించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలు ధరలకు రిస్క్‌గా మారవచ్చు. ప్రస్తుత ధరల తగ్గుదల గురించి యాదవ్ మాట్లాడుతూ, మార్కెట్లో ధరలు ఎక్కడ కనిష్ఠ స్థాయికి చేరుకుంటాయో ముందుగానే అంచనా వేసేందుకు ప్రయత్నించకుండా, వెండిని క్రమంగా కొనుగోలు చేసుకునే అవకాశంగా ఈ పరిస్థితిని చూడవచ్చని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

