బోట్ స్మార్ట్‌రింగ్ యాక్టివ్ ప్లస్ ఫీచర్స్ చూస్తే ఇందులో ఆరోగ్యం, ఫిట్‌నెస్ వివరాలను ఆటోమేటిక్‌గా పర్యవేక్షించే సెన్సార్లు ఉన్నాయి. వీటి ద్వారా హార్ట్ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ), రక్తంలో ఆక్సిజన్ స్థాయి (ఎస్‌పీఓ2), ఒత్తిడి స్థాయి, నిద్రకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. చర్మ ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా కొలిచే ఫీచర్ కూడా ఇందులో ఉంది. రోజువారీ పనులు చేసేటప్పుడు, వ్యాయామం తర్వాత చర్మ ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను గమనించవచ్చు. బోట్ క్రెస్ట్ యాప్ ద్వారా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, వివిధ క్రీడలకు సంబంధించిన ట్రాకింగ్ మోడ్‌లను ఉపయోగించవచ్చు. అయితే ఈ రింగ్ చూపించే ఆరోగ్య వివరాల కచ్చితత్వం మారవచ్చు. వీటిని వైద్య పరీక్షలకు లేదా నిపుణుల వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. (image: Amazon India)

