రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభాగ్యులను గుర్తించి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌కు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారు ఈ శిక్షణా బృందంలో ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 23 మంది అర్హులైన ఒంటరి మహిళలను ఎంపిక చేసి వారికి ఎంతో ఓపికగా శిక్షణ ఇస్తున్నారు.

