ప్రభన్యూస్

White Hair: తెల్ల జుట్టుకు గుడ్‌బై.. ఈ నాచ్యురల్ టిప్స్‌‌తో నల్లగా, ఒత్తుగా మార్చుకోండి | లైఫ్ స్టైల్


Last Updated:

కరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె కలయికను జుట్టు సంరక్షణకు ఉపయోగకరంగా భావిస్తారు. కరివేపాకులో విటమిన్-బి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.

News18
News18

ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, జన్యుపరమైన అంశాలు వంటివి. జుట్టు తెల్లబడిన వెంటనే చాలామంది హెయిర్ డైలు లేదా హెన్నాను ఉపయోగిస్తారు. ఇవి తాత్కాలికంగా జుట్టును నల్లగా కనిపించేలా చేసినా, తరచూ వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనంగా మారే అవకాశం ఉంటుందని కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ & హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. శ్రావ్య చల్లా తెలిపారు.మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తెలిపిన ప్రకారం జుట్టు సహజ రంగుకు కారణమైన మెలనిన్ అనే వర్ణద్రవ్యం శరీరంలో తగ్గిపోతే జుట్టు నెరసడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ వయసు పెరగడంతో సహజంగా జరుగుతుంది. అయితే చిన్న వయసులోనే ఇలా జరగడానికి పోషకాహార లోపం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాల కొరత, అధిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వంటి కారణాలు కూడా దోహదపడవచ్చు. అందుకే జుట్టుకు బయట నుంచి సంరక్షణతో పాటు, లోపల నుంచి కూడా సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం.

కరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె కలయికను జుట్టు సంరక్షణకు ఉపయోగకరంగా భావిస్తారు. కరివేపాకులో విటమిన్-బి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే జుట్టు సహజ రంగును ఎక్కువకాలం కాపాడేందుకు కూడా ఇవి ఉపయోగపడవచ్చని భావిస్తారు.

మెంతులు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో, చుండ్రు సమస్యను తగ్గించడంలో, జుట్టుకు సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు విరిగిపోవడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి కూడా తోడ్పడతాయి.

కొబ్బరి నూనె జుట్టుకు సహజమైన తేమను అందిస్తుంది. కరివేపాకు, మెంతులతో కలిపి ఉపయోగిస్తే దాని ప్రయోజనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నూనెను తయారు చేయాలంటే ఒక కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు, రెండు టీస్పూన్ల మెంతులు వేసి తక్కువ మంటపై వేడి చేయాలి. మెంతులు స్వల్పంగా నల్లబడిన తర్వాత, కరివేపాకు నూనెలో బాగా కలిసిన తర్వాత మంట ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. కనీసం ఒకటి లేదా రెండు గంటలు అలాగే ఉంచి, వీలైతే రాత్రంతా ఉంచి మరుసటి రోజు తేలికపాటి లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

అయితే తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చే ఇంటి చిట్కా ఏదీ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, జుట్టును క్రమం తప్పకుండా సంరక్షించడం వంటి అలవాట్లు అకాలంలో జుట్టు నెరసిపోవడాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే లేదా ఒక్కసారిగా జుట్టు వేగంగా తెల్లబడటం ప్రారంభమైతే, చర్మవ్యాధి నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 5:00 pm Digital Edition : Prabhanews
White Hair: తెల్ల జుట్టుకు గుడ్‌బై.. ఈ నాచ్యురల్ టిప్స్‌‌తో నల్లగా, ఒత్తుగా మార్చుకోండి | లైఫ్ స్టైల్

Last Updated:Aug 05, 2026 3:47 PM ISTకరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె కలయికను జుట్టు సంరక్షణకు ఉపయోగకరంగా భావిస్తారు. కరివేపాకులో విటమిన్-బి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.News18ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, జన్యుపరమైన అంశాలు వంటివి. జుట్టు తెల్లబడిన వెంటనే చాలామంది హెయిర్ డైలు లేదా హెన్నాను ఉపయోగిస్తారు. ఇవి తాత్కాలికంగా జుట్టును నల్లగా కనిపించేలా చేసినా, తరచూ వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనంగా మారే అవకాశం ఉంటుందని కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ & హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. శ్రావ్య చల్లా తెలిపారు.మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తెలిపిన ప్రకారం జుట్టు సహజ రంగుకు కారణమైన మెలనిన్ అనే వర్ణద్రవ్యం శరీరంలో తగ్గిపోతే జుట్టు నెరసడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ వయసు పెరగడంతో సహజంగా జరుగుతుంది. అయితే చిన్న వయసులోనే ఇలా జరగడానికి పోషకాహార లోపం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాల కొరత, అధిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వంటి కారణాలు కూడా దోహదపడవచ్చు. అందుకే జుట్టుకు బయట నుంచి సంరక్షణతో పాటు, లోపల నుంచి కూడా సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం.కరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె కలయికను జుట్టు సంరక్షణకు ఉపయోగకరంగా భావిస్తారు. కరివేపాకులో విటమిన్-బి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే జుట్టు సహజ రంగును ఎక్కువకాలం కాపాడేందుకు కూడా ఇవి ఉపయోగపడవచ్చని భావిస్తారు.మెంతులు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో, చుండ్రు సమస్యను తగ్గించడంలో, జుట్టుకు సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు విరిగిపోవడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి కూడా తోడ్పడతాయి.కొబ్బరి నూనె జుట్టుకు సహజమైన తేమను అందిస్తుంది. కరివేపాకు, మెంతులతో కలిపి ఉపయోగిస్తే దాని ప్రయోజనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నూనెను తయారు చేయాలంటే ఒక కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు, రెండు టీస్పూన్ల మెంతులు వేసి తక్కువ మంటపై వేడి చేయాలి. మెంతులు స్వల్పంగా నల్లబడిన తర్వాత, కరివేపాకు నూనెలో బాగా కలిసిన తర్వాత మంట ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. కనీసం ఒకటి లేదా రెండు గంటలు అలాగే ఉంచి, వీలైతే రాత్రంతా ఉంచి మరుసటి రోజు తేలికపాటి లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.అయితే తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చే ఇంటి చిట్కా ఏదీ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, జుట్టును క్రమం తప్పకుండా సంరక్షించడం వంటి అలవాట్లు అకాలంలో జుట్టు నెరసిపోవడాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే లేదా ఒక్కసారిగా జుట్టు వేగంగా తెల్లబడటం ప్రారంభమైతే, చర్మవ్యాధి నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link