ప్రభన్యూస్

True Story: తన అంత్యక్రియలకు హాజరైన వారికి 93 ఏళ్ల వృద్ధుడి మెసేజ్.. ధన్యజీవి అంటూ కీర్తిస్తున్న జనం |


Last Updated:

True Story: మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని.

News18
News18

Trending News: మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయడం, లేదా ఎదుటి వాళ్ల దృష్టిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. అందుకోసమే బ్రతికి ఉన్నప్పుడు అందరితో మంచిగా నడుచుకోవడం సర్వసాధారణం. కాని చనిపోయిన తర్వాత కూడా మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని. కొట్టాయం జిల్లాలోని పొన్‌కున్నం ప్రాంతంలోని ఇలంపల్లి గ్రామంలో ఆయన అందరికీ ఆత్మీయులుగా ‘కొచ్చుప్పప్పన్’గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన రెండ్రోజుల క్రితం చనిపోయారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన స్వరంతో వచ్చిన ఓ మెసేజ్ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆయన ఏం మెసేజ్ ఇచ్చారో న్యూస్18 మలయాళం ఈ కథనంలో వివరించింది.

చివరి మెసేజ్..

రెండ్రోజుల క్రితం అంటే సోమవారం నాడు వట్టక్కుళి నివాసం, నెయ్యట్టుస్సేరి చర్చి పారిష్ హాల్‌లో వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్దుడి అంత్యక్రియలు జరిగాయి. అక్కడికి వచ్చిన వారికి, ఆయనకు చివరి వీడ్కోలు చెప్పేందుకు హాజరైన వాళ్లందరికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురైంది. అక్కడ కొచ్చుప్పప్పన్(వి.టి. ఆంటోని) స్వయంగా తన గొంతుతో చెప్పిన కృతజ్ఞతా సందేశం వినిపించింది. అంటే తాను బ్రతికి ఉండగానే తన అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ఆడియో మెసేజ్ రికార్డ్ చేసి, దానిని తన కుమారుడు జోమోన్‌కు అప్పగించారు. అదే ఆడియో మెసేజ్‌ని అంత్యక్రియలు నిర్వహిస్తున్న చర్చి, నివాసంలో ప్లే చేశారు కుటుంబ సభ్యులు.

కృతజ్ఞతాభివందనం..

కొచ్చుప్పప్పన్ చివరిగా చెప్పిన మాటలు.. నా అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొని, నాకు అండగా నిలిచిన ప్రియమైన పొరుగువారు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనలలో నన్ను ఎల్లప్పుడూ స్మరించుకోండి… మీ ఆప్యాయతతో కొచ్చుప్పప్పన్ వట్టక్కుళి అంటూ మెసేజ్ ముగించాడు.

మూడు పుస్తకాలు రచించిన రైతు..

93 ఏళ్ల కొచ్చుప్పప్పన్ రైతుగా ఉంటూనే శనివారం కన్నుమూశారు. స్కూల్‌ విద్య వరకే అభ్యసించిన వి.టి. ఆంటోనీ తన జీవిత అనుభవాల ఆధారంగా దేశ చరిత్రపై మూడు పుస్తకాలు రాశారు. అనికాడ్, ఎలాంపల్లి , పల్లిక్కోథోడ్ వంటి ప్రాంతాలకు సంబంధించిన చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు. సమగ్ర చరిత్ర , తన పూర్వీకుల సామాజిక జీవనశైలి అతని రచనల ప్రధాన ఇతివృత్తంగా ఉండేవి. ఆ పుస్తకాలకు మరింత జీవకళను తీసుకురావడానికి రైతు, వెట్టిచాకిరీ చేసే కూలీ, భూస్వామి, బ్రాహ్మణుడు, ‘చెండ’ వాయిద్యకారుడు వంటి వివిధ పాత్రలను స్వయంగా పోషిస్తూ అతను కెమెరా ముందు వీడియో పంచుకున్నారు.

ధన్యజీవి..

గత పంచాయతీ ఎన్నికల సమయంలో తన వార్డులో పోటీ చేసిన అభ్యర్థుల కోసం ఒక ప్రశ్నావళిని రూపొందించడం ద్వారా కూడా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అనారోగ్య సమస్యలు మొదలవ్వడానికి కొద్ది నెలల ముందు వరకు ఆయన తన ఇంటి తోటలో వ్యవసాయ పనుల్లో చురుకుగా ఉండేవారు. శనివారం కాలం చేశారు. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి నెయ్యట్టుస్సేరిలోని సెయింట్ జార్జ్ చర్చి పారిష్ హాల్‌లో ఆయన భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఉంచిన సమయంలో అతను తన ఆత్మీయుల కోసం రికార్డ్ చేసిన చివరి సందేశాన్ని వినిపించారు కుటుంబ సభ్యులు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 4:42 pm Digital Edition : Prabhanews
True Story: తన అంత్యక్రియలకు హాజరైన వారికి 93 ఏళ్ల వృద్ధుడి మెసేజ్.. ధన్యజీవి అంటూ కీర్తిస్తున్న జనం |

Last Updated:Aug 05, 2026 9:03 AM ISTTrue Story: మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని.
News18Trending News: మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయడం, లేదా ఎదుటి వాళ్ల దృష్టిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. అందుకోసమే బ్రతికి ఉన్నప్పుడు అందరితో మంచిగా నడుచుకోవడం సర్వసాధారణం. కాని చనిపోయిన తర్వాత కూడా మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని. కొట్టాయం జిల్లాలోని పొన్‌కున్నం ప్రాంతంలోని ఇలంపల్లి గ్రామంలో ఆయన అందరికీ ఆత్మీయులుగా 'కొచ్చుప్పప్పన్'గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన రెండ్రోజుల క్రితం చనిపోయారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన స్వరంతో వచ్చిన ఓ మెసేజ్ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆయన ఏం మెసేజ్ ఇచ్చారో న్యూస్18 మలయాళం ఈ కథనంలో వివరించింది.చివరి మెసేజ్..రెండ్రోజుల క్రితం అంటే సోమవారం నాడు వట్టక్కుళి నివాసం, నెయ్యట్టుస్సేరి చర్చి పారిష్ హాల్‌లో వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్దుడి అంత్యక్రియలు జరిగాయి. అక్కడికి వచ్చిన వారికి, ఆయనకు చివరి వీడ్కోలు చెప్పేందుకు హాజరైన వాళ్లందరికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురైంది. అక్కడ కొచ్చుప్పప్పన్(వి.టి. ఆంటోని) స్వయంగా తన గొంతుతో చెప్పిన కృతజ్ఞతా సందేశం వినిపించింది. అంటే తాను బ్రతికి ఉండగానే తన అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ఆడియో మెసేజ్ రికార్డ్ చేసి, దానిని తన కుమారుడు జోమోన్‌కు అప్పగించారు. అదే ఆడియో మెసేజ్‌ని అంత్యక్రియలు నిర్వహిస్తున్న చర్చి, నివాసంలో ప్లే చేశారు కుటుంబ సభ్యులు.కృతజ్ఞతాభివందనం..కొచ్చుప్పప్పన్ చివరిగా చెప్పిన మాటలు.. నా అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొని, నాకు అండగా నిలిచిన ప్రియమైన పొరుగువారు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనలలో నన్ను ఎల్లప్పుడూ స్మరించుకోండి... మీ ఆప్యాయతతో కొచ్చుప్పప్పన్ వట్టక్కుళి అంటూ మెసేజ్ ముగించాడు.మూడు పుస్తకాలు రచించిన రైతు..93 ఏళ్ల కొచ్చుప్పప్పన్ రైతుగా ఉంటూనే శనివారం కన్నుమూశారు. స్కూల్‌ విద్య వరకే అభ్యసించిన వి.టి. ఆంటోనీ తన జీవిత అనుభవాల ఆధారంగా దేశ చరిత్రపై మూడు పుస్తకాలు రాశారు. అనికాడ్, ఎలాంపల్లి , పల్లిక్కోథోడ్ వంటి ప్రాంతాలకు సంబంధించిన చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు. సమగ్ర చరిత్ర , తన పూర్వీకుల సామాజిక జీవనశైలి అతని రచనల ప్రధాన ఇతివృత్తంగా ఉండేవి. ఆ పుస్తకాలకు మరింత జీవకళను తీసుకురావడానికి రైతు, వెట్టిచాకిరీ చేసే కూలీ, భూస్వామి, బ్రాహ్మణుడు, 'చెండ' వాయిద్యకారుడు వంటి వివిధ పాత్రలను స్వయంగా పోషిస్తూ అతను కెమెరా ముందు వీడియో పంచుకున్నారు.ధన్యజీవి..గత పంచాయతీ ఎన్నికల సమయంలో తన వార్డులో పోటీ చేసిన అభ్యర్థుల కోసం ఒక ప్రశ్నావళిని రూపొందించడం ద్వారా కూడా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అనారోగ్య సమస్యలు మొదలవ్వడానికి కొద్ది నెలల ముందు వరకు ఆయన తన ఇంటి తోటలో వ్యవసాయ పనుల్లో చురుకుగా ఉండేవారు. శనివారం కాలం చేశారు. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి నెయ్యట్టుస్సేరిలోని సెయింట్ జార్జ్ చర్చి పారిష్ హాల్‌లో ఆయన భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఉంచిన సమయంలో అతను తన ఆత్మీయుల కోసం రికార్డ్ చేసిన చివరి సందేశాన్ని వినిపించారు కుటుంబ సభ్యులు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Aug 05, 2026 11:24 AM ISTమరింత చదవండి

Source link