మీ ప్రాంతంలో హార్డ్ వాటర్ సరఫరా అవుతుంటే ట్యాప్‌లు, షవర్‌లు, సింక్‌లు, బాత్రూమ్ టైల్స్‌పై తెల్లటి మరకలు ఏర్పడటం సహజం. మొదట్లో ఇవి చిన్నగా కనిపించినా, ఎక్కువకాలం శుభ్రం చేయకుండా వదిలేస్తే గట్టిపడి తొలగించడం కష్టమవుతుంది. అంతేకాదు, ట్యాప్ మెరుపు తగ్గిపోవడంతో పాటు ట్యాప్ చివర ఉండే జాలి (ఏరేటర్) కూడా మూసుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో నీటి ప్రవాహం కూడా తగ్గిపోతుంది.

