Last Updated:
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’ ఎట్టకేలకు డిజిటల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్టోబర్ 30న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నెల రోజులు పూర్తి కాకముందే నేడు (నవంబర్ 27) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అడుగుపెట్టింది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎంచక్కా ఇంట్లోనే ఈ ఆదర్శ కుటుంబం చూసేయొచ్చు.
డిజిటల్ హక్కుల విషయానికి వస్తే, నెట్‌ఫ్లిక్స్ సంస్థ సుమారు రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో మెరిశారు. వీరితో పాటు నారా రోహిత్, రావు రమేశ్, సత్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, రఘుబాబు వంటి భారీ తారాగణం సందడి చేసింది. తమన్ సంగీతం, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తికి ఏకంగా రూ. 100 కోట్ల లాటరీ తగలడం, ఆ డబ్బు కారణంగా అతని కుటుంబానికి ఎదురయ్యే విచిత్రమైన సమస్యలు, నేరగాళ్ల నుంచి వచ్చే ముప్పు చుట్టూ కామెడీ, యాక్షన్ మరియు భావోద్వేగాల మేళవింపుతో త్రివిక్రమ్ ఈ కథను ఆసక్తికరంగా మలిచారు.
భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది. తొలి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్ల వేగం మందగించడంతో బ్రేక్ ఈవెన్ సాధించడంలో తడబడింది. అయినప్పటికీ, వెంకటేష్ తనదైన సెటిల్డ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులను బాగానే అలరించాయి. సో, చేయాలి మరి ఈ ఆదర్శ కుటుంబం ఓటీటీ వేదికపై ఏ మేర రాణిస్తుంది? ఇక్కడైనా ఆడియన్స్ ఆదరణ పొందుతుందా? లేదా అనేది.

