7వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. అప్పటివరకు పెరిగిన 125 శాతం డీఏను బేసిక్ పేలో కలిపి, అదనంగా దాదాపు 14 శాతం జీతం పెంచారు. అలవెన్సులు, పెన్షన్లు కలిపిన తర్వాత ప్రభుత్వంపై మొత్తం జీతాల భారం 23.55 శాతం పెరిగింది. 8వ వేతన సంఘం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే ఇది సంస్థ వేసిన అంచనా మాత్రమే. వేతన సంఘం నిజంగా ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేస్తుందో ఇంకా తెలియదు. జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం, 1.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రస్తుతం ఉన్న కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి సుమారు రూ.33,000కు పెరగవచ్చు. ఉద్యోగులకు సగటున నెలకు రూ.15,400 అదనంగా అందవచ్చని, దీనికి తోడు సుమారు రూ.3.4 లక్షల పాత బకాయిలు రావచ్చని సంస్థ తెలిపింది. దాదాపు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2028, 2029 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.7.2 లక్షల కోట్ల (77 బిలియన్ డాలర్లు) ప్రయోజనం అందవచ్చని అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)

