ప్రభన్యూస్

Ukraine-Russia War: ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని జెలెన్‌స్కీ.. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మళ్లీ భగ్గుమన్న యుద్ధం! |


Last Updated:

రష్యా ఆయిల్ రిఫైనరీలపై దాడులు ఆపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. రష్యాపై తాజా డ్రోన్ దాడులతో కాల్పుల విరమణ ఒప్పందానికి తెరదించారు.

News18
News18

రష్యా ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్లను ఇకపై ఎంతమాత్రం పాటించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గురువారం స్పష్టం చేశారు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే, గురువారం తెల్లవారుజామునే రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లోకి డీజిల్‌ను విడుదల చేయాలనే షరతుతో రష్యాపై ఆంక్షలను సడలిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు.

అది చాలా బలహీనమైన నిర్ణయమని, పుతిన్‌కు మరింత ఊతమిచ్చేలా ఉందని మండిపడ్డారు. ట్రంప్ అనుసరిస్తున్న తీరు తమను వెన్నుపోటు పొడిచినట్లుగా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధరలు పెరగడానికి ఉక్రెయిన్ దాడులే కారణమని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ జెలెన్‌స్కీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించగా, ఆ ఒప్పందంపై తనకు ఎలాంటి సమాచారం లేదని జెలెన్‌స్కీ కొట్టిపారేశారు.

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ఉద్రిక్తతల నడుమ యూరోపియన్ భాగస్వాముల మద్దతు కూడగట్టేందుకు జెలెన్‌స్కీ గురువారం బ్రస్సెల్స్ చేరుకున్నారు. నాటో సెక్రటరీ జనరల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, పోలాండ్, డెన్మార్క్ ప్రధానులతో కీలక చర్చలు జరుపుతున్నారు. యుద్ధం ముగియాలంటే రష్యాపై పూర్తి ఒత్తిడి పెంచి, ఉక్రెయిన్‌కు రక్షణ సాయం భారీగా అందించాలని ఆయన యూరప్ దేశాలకు పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 10:06 pm Digital Edition : Prabhanews
Ukraine-Russia War: ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని జెలెన్‌స్కీ.. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మళ్లీ భగ్గుమన్న యుద్ధం! |

Last Updated:Oct 15, 2026 10:03 PM ISTరష్యా ఆయిల్ రిఫైనరీలపై దాడులు ఆపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. రష్యాపై తాజా డ్రోన్ దాడులతో కాల్పుల విరమణ ఒప్పందానికి తెరదించారు.News18రష్యా ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్లను ఇకపై ఎంతమాత్రం పాటించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గురువారం స్పష్టం చేశారు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే, గురువారం తెల్లవారుజామునే రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లోకి డీజిల్‌ను విడుదల చేయాలనే షరతుతో రష్యాపై ఆంక్షలను సడలిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు.అది చాలా బలహీనమైన నిర్ణయమని, పుతిన్‌కు మరింత ఊతమిచ్చేలా ఉందని మండిపడ్డారు. ట్రంప్ అనుసరిస్తున్న తీరు తమను వెన్నుపోటు పొడిచినట్లుగా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధరలు పెరగడానికి ఉక్రెయిన్ దాడులే కారణమని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ జెలెన్‌స్కీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించగా, ఆ ఒప్పందంపై తనకు ఎలాంటి సమాచారం లేదని జెలెన్‌స్కీ కొట్టిపారేశారు.
Already in Brussels with my team to attend the European Council meeting and hold talks with our partners.
Important meetings are scheduled for today with the NATO Secretary General, the President of France, and the prime ministers of Poland, Denmark, and Belgium. I will also have an audience with King Philippe of the Belgians. Tomorrow, meetings are planned with the presidents of the European Council and the European Commission, as well as the prime ministers of Hungary, Finland, and Sweden.All of us in Europe want this war to end. And for that to happen, strong signals are needed – more real pressure on Russia and more defense support for Ukraine. It is especially important now to act together to protect lives.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 15, 2026న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ఉద్రిక్తతల నడుమ యూరోపియన్ భాగస్వాముల మద్దతు కూడగట్టేందుకు జెలెన్‌స్కీ గురువారం బ్రస్సెల్స్ చేరుకున్నారు. నాటో సెక్రటరీ జనరల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, పోలాండ్, డెన్మార్క్ ప్రధానులతో కీలక చర్చలు జరుపుతున్నారు. యుద్ధం ముగియాలంటే రష్యాపై పూర్తి ఒత్తిడి పెంచి, ఉక్రెయిన్‌కు రక్షణ సాయం భారీగా అందించాలని ఆయన యూరప్ దేశాలకు పిలుపునిచ్చారు.మరింత చదవండి

Source link