ప్రభన్యూస్

మక్కా మసీదులో అసభ్యకర పనులు.. జంటకు మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా! |


Last Updated:

పవిత్ర మక్కా నగరంలోని మసీదులో అనుచిత, అనైతిక చర్యలకు పాల్పడిన నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక జంటకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. కోర్టుల అనుమతి, రాయల్ డిక్రీ అనంతరం శిక్ష అమలైంది.

News18
News18

పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలోని ఒక మసీదు ప్రాంగణంలో తీవ్ర అసభ్యకర పనులకు పాల్పడ్డారన్న నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పౌరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరణశిక్ష పడిన వారిని నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితీ అక్తర్‌లుగా గుర్తించారు. వారు దేశంలో నివసిస్తున్న సమయంలో మసీదు పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని సెక్యూరిటీ దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో వారి నేరం రుజువు కావడంతో క్రిమినల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ‘తాజీర్’ (విచక్షణారహిత శిక్ష) కింద ఇద్దరికీ ఉరిశిక్ష విధించింది.

రాయల్ డిక్రీతో మరణశిక్ష అమలు

దిగువ కోర్టు విధించిన మరణశిక్షపై నిందితులు అప్పీల్ చేసుకోగా, అప్పిలేట్ కోర్టుతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోవడంతో, శిక్ష అమలు చేయడానికి సౌదీ రాజు అధికారికంగా రాయల్ ఆర్డర్ జారీ చేశారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే మక్కా రీజియన్‌లో ఈ మరణశిక్షలు అమలు చేశారు.

మతపరమైన పవిత్ర స్థలాల్లో ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా నైతికతను కాపాడటంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాల పవిత్రతను భంగపరిచినా, చట్టాలను ఉల్లంఘించినా ఎంతటి వారైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విదేశీ పౌరులను గట్టిగా హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 10:31 pm Digital Edition : Prabhanews
మక్కా మసీదులో అసభ్యకర పనులు.. జంటకు మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా! |

Last Updated:Oct 15, 2026 10:25 PM ISTపవిత్ర మక్కా నగరంలోని మసీదులో అనుచిత, అనైతిక చర్యలకు పాల్పడిన నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక జంటకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. కోర్టుల అనుమతి, రాయల్ డిక్రీ అనంతరం శిక్ష అమలైంది.News18పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలోని ఒక మసీదు ప్రాంగణంలో తీవ్ర అసభ్యకర పనులకు పాల్పడ్డారన్న నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పౌరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరణశిక్ష పడిన వారిని నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితీ అక్తర్‌లుగా గుర్తించారు. వారు దేశంలో నివసిస్తున్న సమయంలో మసీదు పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని సెక్యూరిటీ దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో వారి నేరం రుజువు కావడంతో క్రిమినల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం 'తాజీర్' (విచక్షణారహిత శిక్ష) కింద ఇద్దరికీ ఉరిశిక్ష విధించింది.రాయల్ డిక్రీతో మరణశిక్ష అమలుదిగువ కోర్టు విధించిన మరణశిక్షపై నిందితులు అప్పీల్ చేసుకోగా, అప్పిలేట్ కోర్టుతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోవడంతో, శిక్ష అమలు చేయడానికి సౌదీ రాజు అధికారికంగా రాయల్ ఆర్డర్ జారీ చేశారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే మక్కా రీజియన్‌లో ఈ మరణశిక్షలు అమలు చేశారు.మతపరమైన పవిత్ర స్థలాల్లో ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా నైతికతను కాపాడటంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాల పవిత్రతను భంగపరిచినా, చట్టాలను ఉల్లంఘించినా ఎంతటి వారైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విదేశీ పౌరులను గట్టిగా హెచ్చరించింది.మరింత చదవండి

Source link