దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని చిరంజీవి ఏలాడు. స్వయంకృషి, పసివాడి ప్రాణం, రుద్రవీణ, యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, హిట్లర్, ముఠా మేస్త్రీ, స్నేహం కోసం, చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు చిరుకి మరపురాని సక్సెస్‌ని అందించాయి. 1980ల చివర్లో ఒకే ఏడాదిలో 14 హిట్లను సాధించి ఇండియన్ సినిమా ‘ది న్యూ మనీ మెషీన్’ అనే బిరుదుని పొందాడు.

