Last Updated:
గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న గాయం అయిన వెంటనే పసుపు పూయడం మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. పసుపు వల్ల గాయం త్వరగా మానిపోతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఎక్స్పరిమెంట్స్, జంతు అధ్యయనాల్లో కనిపించిన ఫలితాలను బట్టి మనుషుల గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

