ప్రభన్యూస్

Train Tickets: సికింద్రాబాద్, చర్లపల్లి రైళ్లలో వందల కొద్దీ సీట్లు ఖాళీ.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! | బిజినెస్


Last Updated:

రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భయం ఇక వదిలేయండి.. అమాంతం ఖాళీగా ఉన్న బెర్తులు ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి!

News18
News18

పండగ సీజన్లో సొంతూరికి వెళ్లడం అంటే రైళ్లలో బెర్త్ దొరకడం ఒక పెద్ద యుద్ధమే. కానీ ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన అవకాశం కల్పించింది. నవంబర్ నెలలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక రైళ్లలో బెర్తుల లభ్యతను ప్రకటిస్తూ తీపి కబురు అందించింది. పలు ప్రాంతాలకు నడిచే స్పెషల్ రైళ్లలో ఇంకా ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 29 రాత్రి 8 గంటల సమయానికి ఉన్న వివరాలను రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లలో విశేషంగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు (07425) ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇందులో నవంబర్ 1న 312, 8న 604, 15న 601, 22న 542, 29న 621 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలులో (07037) మంగళవారాల్లో ప్రయాణానికి నవంబర్ 3న 201, 10న 670, 17న 679, 24న 267 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కరెంట్ కష్టాలతో పల్లెల్లో దారుణ పరిస్థితులు.. డ్రోన్ల కాలంలో ఏతం పట్టిన గిరిజన రైతు!

ఇదే మార్గంలో సికింద్రాబాద్ నుంచి నహర్లాగున్ వెళ్లే శుక్రవారం రైలులో (07046) నవంబర్ 20న 497, 27న 784 ఖాళీలు దర్శనమిస్తున్నాయి. చర్లపల్లి నుంచి సంత్రగచ్చి వెళ్లే శనివారం రైలులో (07221) నవంబర్ 7న 529, 14న 701, 21న 705, 28న 723 బెర్తులు ఉన్నాయి. అలాగే నవంబర్ 28న నడిచే మరో చర్లపల్లి – సంత్రగచ్చి రైలులో (08046) 229 ఖాళీలుండగా, చర్లపల్లి నుంచి బ్రహ్మపూర్ వెళ్లే శుక్రవారం రైలులో (07027) నవంబర్ 13న 342, 20న 252, 27న 196 సీట్లు మిగిలి ఉన్నట్లు డేటా స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే 4 రోజుల్లో 3 రోజులు స్కూళ్లకు సెలవులే.. విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్!

కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సైతం సీట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్లపల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే సోమవారం రైలులో (07063) నవంబర్ 2న 223, 9న 464, 16న 460, 23న 458, 30న 459 బెర్తులు రిజర్వేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే బుధవారం రైలులో (07039) నవంబర్ 4న 374 సీట్లు ఉండగా, 11న 744, 18న 744, 25న 697 బెర్తులు ప్రయాణికుల బుకింగ్ కోసం ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

బెర్తుల లభ్యత అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని రైల్వే శాఖ ప్రయాణికులకు గుర్తు చేస్తోంది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రజలు బుక్ చేసుకునే కొద్దీ ఈ సీట్ల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. కాబట్టి చివరి నిమిషం దాకా వేచి చూడకుండా, వెంటనే అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచిస్తోంది. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 4:02 pm Digital Edition : Prabhanews
Train Tickets: సికింద్రాబాద్, చర్లపల్లి రైళ్లలో వందల కొద్దీ సీట్లు ఖాళీ.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! | బిజినెస్

Last Updated:Oct 30, 2026 3:42 PM ISTరైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భయం ఇక వదిలేయండి.. అమాంతం ఖాళీగా ఉన్న బెర్తులు ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి!News18పండగ సీజన్లో సొంతూరికి వెళ్లడం అంటే రైళ్లలో బెర్త్ దొరకడం ఒక పెద్ద యుద్ధమే. కానీ ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన అవకాశం కల్పించింది. నవంబర్ నెలలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక రైళ్లలో బెర్తుల లభ్యతను ప్రకటిస్తూ తీపి కబురు అందించింది. పలు ప్రాంతాలకు నడిచే స్పెషల్ రైళ్లలో ఇంకా ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 29 రాత్రి 8 గంటల సమయానికి ఉన్న వివరాలను రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది.ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లలో విశేషంగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు (07425) ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇందులో నవంబర్ 1న 312, 8న 604, 15న 601, 22న 542, 29న 621 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలులో (07037) మంగళవారాల్లో ప్రయాణానికి నవంబర్ 3న 201, 10న 670, 17న 679, 24న 267 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: తెలంగాణలో కరెంట్ కష్టాలతో పల్లెల్లో దారుణ పరిస్థితులు.. డ్రోన్ల కాలంలో ఏతం పట్టిన గిరిజన రైతు!ఇదే మార్గంలో సికింద్రాబాద్ నుంచి నహర్లాగున్ వెళ్లే శుక్రవారం రైలులో (07046) నవంబర్ 20న 497, 27న 784 ఖాళీలు దర్శనమిస్తున్నాయి. చర్లపల్లి నుంచి సంత్రగచ్చి వెళ్లే శనివారం రైలులో (07221) నవంబర్ 7న 529, 14న 701, 21న 705, 28న 723 బెర్తులు ఉన్నాయి. అలాగే నవంబర్ 28న నడిచే మరో చర్లపల్లి - సంత్రగచ్చి రైలులో (08046) 229 ఖాళీలుండగా, చర్లపల్లి నుంచి బ్రహ్మపూర్ వెళ్లే శుక్రవారం రైలులో (07027) నవంబర్ 13న 342, 20న 252, 27న 196 సీట్లు మిగిలి ఉన్నట్లు డేటా స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే 4 రోజుల్లో 3 రోజులు స్కూళ్లకు సెలవులే.. విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్!కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సైతం సీట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్లపల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే సోమవారం రైలులో (07063) నవంబర్ 2న 223, 9న 464, 16న 460, 23న 458, 30న 459 బెర్తులు రిజర్వేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే బుధవారం రైలులో (07039) నవంబర్ 4న 374 సీట్లు ఉండగా, 11న 744, 18న 744, 25న 697 బెర్తులు ప్రయాణికుల బుకింగ్ కోసం ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.బెర్తుల లభ్యత అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని రైల్వే శాఖ ప్రయాణికులకు గుర్తు చేస్తోంది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రజలు బుక్ చేసుకునే కొద్దీ ఈ సీట్ల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. కాబట్టి చివరి నిమిషం దాకా వేచి చూడకుండా, వెంటనే అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచిస్తోంది. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.మరింత చదవండి

Source link