ఈ గింబల్‌లో పలు షూటింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఆల్ ఫాలో మోడ్, హాఫ్ ఫాలో మోడ్, ఆల్ లాక్ మోడ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మోడ్ ఒక్కో రకమైన వీడియో షూటింగ్‌కు ఉపయోగపడుతుంది. కెమెరా కదలికలను కూడా మన అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒక్క బటన్ నొక్కితే హారిజాంటల్, వర్టికల్ షూటింగ్ మధ్య మారవచ్చు. అంటే సాధారణ ల్యాండ్‌స్కేప్ వీడియోలతో పాటు సోషల్ మీడియా కోసం వర్టికల్ వీడియోలు కూడా సులభంగా రికార్డ్ చేయొచ్చు. దీని ఫోల్డబుల్ డిజైన్ వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రయాణాలు చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 160 డిగ్రీల టిల్ట్ యాంగిల్, 325 డిగ్రీల రోల్ యాంగిల్, 340 డిగ్రీల పాన్ యాంగిల్ సపోర్ట్ ఉన్నాయి. ఈ గింబల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది. యాపిల్, శాంసంగ్, గూగుల్ పిక్సెల్, రియల్‌మీ, ఒప్పో, వివో, నోకియా వంటి ప్రముఖ బ్రాండ్ల ఫోన్లతో ఉపయోగించుకోవచ్చు. (image: DIGITEK)

