ప్రభన్యూస్

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్.. |


అర్నాబ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు లీవ్ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఆహారం, తాగునీరు సిద్ధం చేసుకోవాలని కాకినాడ కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

2.ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ఆర్నబ్ తుఫాన్‌ దూసుకొస్తుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదకర తీరప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ బృందాలు, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

3.తుమ్మిడిహెట్టికి అభ్యంతరం లేదు..

తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశంపై ముంబయి వేదికగా తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై చర్చలు సఫలమైనట్లు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదనలను పెద్ద మనసుతో పరిశీలించిన ఫడణవీస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికత, ముంపు అంశాలపై అధ్యయనం చేయడానికి అధికారులతో ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గిరిజనుల జీవితాల మార్పునకు పూర్తి సహకారం అందిస్తానని ఫడణవీస్‌ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ ఎక్స్‌ వేదికగా చెప్పారు.

4.ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసు.. నేపాలీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య తనూజ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన నేపాలీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం నేపాల్ వెళ్ళింది. అక్కడ ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మే 7న ఈ ముఠా తనూజను హత్య చేసి ఇంట్లోని బంగారు నగలతో పరారైంది. అరెస్ట్ చేసిన నిందితులకు విచారణ అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

5.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ సవాల్‌ విసిరారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరవేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దేవాదుల, కల్వకుర్తి పంపుల వాడకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అలాగే తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

6.రాహుల్‌ గాంధీకి.. ఏటీఎం కార్డులా సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా మార్చి సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా పనిచేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యుల భూములు, రూ.వెయ్యి కోట్ల వ్యాపార ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

7.ఢిల్లీలో ఖర్గే నివాసం ముట్టడికి బీజేపీ యత్నం..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తండ్రిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. ఖర్గే నివాస ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ప్రధానిని కించపరిచినందుకు ఖర్గే, రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

8. యుద్ధాల కోసం.. ‘కోట’ కడుతోన్న అమెరికా..!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధ భయాలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా భూభాగాన్ని రక్షించుకోవడానికి పెంటగాన్ ‘ఫోర్ట్రెస్‌’ ప్లాన్‌ను వేగవంతం చేసింది. యుద్ధ సమయంలో పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా సైనిక స్థావరాలు కనీసం 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేసేలా వ్యూహాలు రచిస్తోంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయినా సైన్యం నిలదొక్కుకునేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. దేశ భద్రత కోసం సాధారణ పౌర వనరులపై ఆధారపడటం ప్రమాదకరమని పెంటగాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.

9. 100 సార్లు కాదు 1000 సార్లు ప్రపోజ్ చేస్తా..

‘కాఫీ విత్ కరణ్’ షోలో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై నటి రష్మిక స్పందిస్తూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. తమపై కావాలనే కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెళ్లి అనేది ఉంగరాలు మార్చుకోవడం కాదని, కలిసి ఒక జీవితాన్ని నిర్మించుకోవడమేనని స్పష్టం చేశారు. తాను తన భర్త పిచ్చి ప్రేమలో ఉన్నానని, జీవితాంతం తోడుండే వ్యక్తికి ఎన్నిసార్లయినా ప్రపోజ్ చేస్తానని రష్మిక అన్నారు. విజయ్‌తో కలిసి ఉన్న క్యూట్ వీడియోను షేర్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు.

10.ఏపీలో ‘ఆదర్శ కుటుంబం’ టికెట్‌ రేట్ల పెంపు..

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్ర టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా అక్టోబరు 30న విడుదల కానుంది. జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.50 వరకు ధరలు పెంచుకునేందుకు జీవో జారీ చేశారు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 9:26 pm Digital Edition : Prabhanews
Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్.. |

అర్నాబ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు లీవ్ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఆహారం, తాగునీరు సిద్ధం చేసుకోవాలని కాకినాడ కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.2.ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ఆర్నబ్ తుఫాన్‌ దూసుకొస్తుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదకర తీరప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ బృందాలు, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.3.తుమ్మిడిహెట్టికి అభ్యంతరం లేదు.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశంపై ముంబయి వేదికగా తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై చర్చలు సఫలమైనట్లు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదనలను పెద్ద మనసుతో పరిశీలించిన ఫడణవీస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికత, ముంపు అంశాలపై అధ్యయనం చేయడానికి అధికారులతో ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గిరిజనుల జీవితాల మార్పునకు పూర్తి సహకారం అందిస్తానని ఫడణవీస్‌ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ ఎక్స్‌ వేదికగా చెప్పారు.4.ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసు.. నేపాలీ ముఠా అరెస్ట్‌హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య తనూజ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన నేపాలీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం నేపాల్ వెళ్ళింది. అక్కడ ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మే 7న ఈ ముఠా తనూజను హత్య చేసి ఇంట్లోని బంగారు నగలతో పరారైంది. అరెస్ట్ చేసిన నిందితులకు విచారణ అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.5.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ సవాల్‌ విసిరారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరవేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దేవాదుల, కల్వకుర్తి పంపుల వాడకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అలాగే తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.6.రాహుల్‌ గాంధీకి.. ఏటీఎం కార్డులా సీఎం రేవంత్‌రెడ్డికాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా మార్చి సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా పనిచేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యుల భూములు, రూ.వెయ్యి కోట్ల వ్యాపార ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.7.ఢిల్లీలో ఖర్గే నివాసం ముట్టడికి బీజేపీ యత్నం..ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తండ్రిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. ఖర్గే నివాస ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ప్రధానిని కించపరిచినందుకు ఖర్గే, రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.8. యుద్ధాల కోసం.. ‘కోట’ కడుతోన్న అమెరికా..!పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధ భయాలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా భూభాగాన్ని రక్షించుకోవడానికి పెంటగాన్ ‘ఫోర్ట్రెస్‌’ ప్లాన్‌ను వేగవంతం చేసింది. యుద్ధ సమయంలో పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా సైనిక స్థావరాలు కనీసం 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేసేలా వ్యూహాలు రచిస్తోంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయినా సైన్యం నిలదొక్కుకునేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. దేశ భద్రత కోసం సాధారణ పౌర వనరులపై ఆధారపడటం ప్రమాదకరమని పెంటగాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.9. 100 సార్లు కాదు 1000 సార్లు ప్రపోజ్ చేస్తా..‘కాఫీ విత్ కరణ్’ షోలో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై నటి రష్మిక స్పందిస్తూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. తమపై కావాలనే కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెళ్లి అనేది ఉంగరాలు మార్చుకోవడం కాదని, కలిసి ఒక జీవితాన్ని నిర్మించుకోవడమేనని స్పష్టం చేశారు. తాను తన భర్త పిచ్చి ప్రేమలో ఉన్నానని, జీవితాంతం తోడుండే వ్యక్తికి ఎన్నిసార్లయినా ప్రపోజ్ చేస్తానని రష్మిక అన్నారు. విజయ్‌తో కలిసి ఉన్న క్యూట్ వీడియోను షేర్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు.10.ఏపీలో ‘ఆదర్శ కుటుంబం’ టికెట్‌ రేట్ల పెంపు..ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్ర టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా అక్టోబరు 30న విడుదల కానుంది. జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.50 వరకు ధరలు పెంచుకునేందుకు జీవో జారీ చేశారు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

Source link