ప్రభన్యూస్

FD Rates: ఎఫ్‌డీ చేసే వారికి గుడ్‌న్యూస్.. ఈ రెండు బ్యాంకుల్లో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. | బిజినెస్


Last Updated:

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ రెండు బ్యాంకులు ప్రకటించిన కొత్త వడ్డీ రేట్లను తప్పక తెలుసుకోవాలి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుంది? 555, 777 రోజుల డిపాజిట్లపై కొత్త రేట్లు ఎంతకు చేరాయి? పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి.

News18
News18

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (ఎఫ్‌డీ) డబ్బులు దాచుకోవాలనుకునే వారికి రెండు బ్యాంకులు శుభవార్త అందించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమకు చెందిన కొన్ని ప్రత్యేక కాలపరిమితుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో కొత్తగా డిపాజిట్ చేసే వినియోగదారులకు గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కూడా ఈ మార్పుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే అన్ని రకాల ఎఫ్‌డీలపై వడ్డీ పెరగలేదు. నిర్దిష్ట కాలవ్యవధి కలిగిన పథకాలకు మాత్రమే కొత్త రేట్లు వర్తిస్తాయి. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ వివరాలను తెలుసుకోవడం అవసరం.

ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎంత వడ్డీ వస్తుంది?

ఐసీఐసీఐ బ్యాంక్ రెండేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు కాలపరిమితి ఉన్న కొన్ని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. గతంలో రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ లభించేది. తాజాగా దీనిని 6.55 శాతానికి పెంచారు. అలాగే, మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు ఉండే ఎఫ్‌డీలపై వడ్డీ 6.50 శాతం నుంచి 6.60 శాతానికి చేరింది.

ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీతో పాటు, ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై కూడా ఇకపై 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ చెల్లించేవారు.

సాధారణ వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై కాలపరిమితిని బట్టి 2.75 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.20 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలతో పాటు, ఐదేళ్ల పన్ను ఆదా డిపాజిట్లపై ఈ గరిష్ఠ రేటు వర్తిస్తుంది.

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక పథకాలపై పెంపు

ఇండియన్ బ్యాంక్ కూడా తన రెండు ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం పెంచింది. 555 రోజుల కాలపరిమితి కలిగిన ‘ఇండ్ గ్రో’ పథకంపై గతంలో 6.65 శాతం వడ్డీ ఉండగా, ప్రస్తుతం దానిని 6.80 శాతానికి పెంచారు. అదేవిధంగా, 777 రోజుల ‘ఇండ్ ప్రాస్పర్’ పథకంపై వడ్డీ రేటు 6.60 శాతం నుంచి 6.75 శాతానికి చేరింది. ఈ రేట్లు రూ.3 కోట్లలోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.

సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ

ఇండియన్ బ్యాంక్‌లో ఈ రెండు ప్రత్యేక పథకాలపై సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేట్ల కంటే అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఇతర కాలపరిమితులున్న చాలా ఎఫ్‌డీల వడ్డీ రేట్లలో మాత్రం మార్పులు చేయలేదు. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు తమకు అవసరమైన కాలపరిమితి, వర్తించే వడ్డీ రేటును పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 10:42 pm Digital Edition : Prabhanews
FD Rates: ఎఫ్‌డీ చేసే వారికి గుడ్‌న్యూస్.. ఈ రెండు బ్యాంకుల్లో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. | బిజినెస్

Last Updated:Oct 26, 2026 10:25 PM ISTఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ రెండు బ్యాంకులు ప్రకటించిన కొత్త వడ్డీ రేట్లను తప్పక తెలుసుకోవాలి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుంది? 555, 777 రోజుల డిపాజిట్లపై కొత్త రేట్లు ఎంతకు చేరాయి? పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి.
News18FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (ఎఫ్‌డీ) డబ్బులు దాచుకోవాలనుకునే వారికి రెండు బ్యాంకులు శుభవార్త అందించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమకు చెందిన కొన్ని ప్రత్యేక కాలపరిమితుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో కొత్తగా డిపాజిట్ చేసే వినియోగదారులకు గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కూడా ఈ మార్పుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే అన్ని రకాల ఎఫ్‌డీలపై వడ్డీ పెరగలేదు. నిర్దిష్ట కాలవ్యవధి కలిగిన పథకాలకు మాత్రమే కొత్త రేట్లు వర్తిస్తాయి. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ వివరాలను తెలుసుకోవడం అవసరం.ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎంత వడ్డీ వస్తుంది?ఐసీఐసీఐ బ్యాంక్ రెండేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు కాలపరిమితి ఉన్న కొన్ని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. గతంలో రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ లభించేది. తాజాగా దీనిని 6.55 శాతానికి పెంచారు. అలాగే, మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు ఉండే ఎఫ్‌డీలపై వడ్డీ 6.50 శాతం నుంచి 6.60 శాతానికి చేరింది.ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీతో పాటు, ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై కూడా ఇకపై 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ చెల్లించేవారు.సాధారణ వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై కాలపరిమితిని బట్టి 2.75 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.20 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలతో పాటు, ఐదేళ్ల పన్ను ఆదా డిపాజిట్లపై ఈ గరిష్ఠ రేటు వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక పథకాలపై పెంపుఇండియన్ బ్యాంక్ కూడా తన రెండు ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం పెంచింది. 555 రోజుల కాలపరిమితి కలిగిన ‘ఇండ్ గ్రో’ పథకంపై గతంలో 6.65 శాతం వడ్డీ ఉండగా, ప్రస్తుతం దానిని 6.80 శాతానికి పెంచారు. అదేవిధంగా, 777 రోజుల ‘ఇండ్ ప్రాస్పర్’ పథకంపై వడ్డీ రేటు 6.60 శాతం నుంచి 6.75 శాతానికి చేరింది. ఈ రేట్లు రూ.3 కోట్లలోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీఇండియన్ బ్యాంక్‌లో ఈ రెండు ప్రత్యేక పథకాలపై సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేట్ల కంటే అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఇతర కాలపరిమితులున్న చాలా ఎఫ్‌డీల వడ్డీ రేట్లలో మాత్రం మార్పులు చేయలేదు. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు తమకు అవసరమైన కాలపరిమితి, వర్తించే వడ్డీ రేటును పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.మరింత చదవండి

Source link