ప్రభన్యూస్

Tiger Shroff: స్టార్ హీరో కారుపై కాల్పుల కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ముంబై జుహు పరిధిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు ఒక ఆటో డ్రైవర్ గాయపడ్డారు.

News18
News18

ముంబై నగరంలోని జుహు పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి పుష్ప పార్క్ సమీపంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. అయితే కారు నడుపుతున్న హీరో డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ బుల్లెట్ గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నిందితులను పట్టుకునేందుకు జుహు పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముంబైలో ప్రముఖ సినీ తారలను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న దాడులు చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా?

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున అనిల్ పండిట్ అనే గ్యాంగ్‌స్టర్ బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఆడియో సందేశం సంచలనం రేపింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయవద్దని తాము హెచ్చరించినా టైగర్ ష్రాఫ్ పట్టించుకోకపోవడం వల్లే ఈ దాడికి పాల్పడినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టు ప్రామాణికతపై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

మరోవైపు ఈ దుర్ఘటన మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, తాజాగా టైగర్ ష్రాఫ్‌పై దాడి ఘటనలతో ముంబైలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని, ముఖ్యమంత్రి శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 8:27 pm Digital Edition : Prabhanews
Tiger Shroff: స్టార్ హీరో కారుపై కాల్పుల కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 8:25 PM ISTముంబై జుహు పరిధిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు ఒక ఆటో డ్రైవర్ గాయపడ్డారు.News18ముంబై నగరంలోని జుహు పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి పుష్ప పార్క్ సమీపంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. అయితే కారు నడుపుతున్న హీరో డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ బుల్లెట్ గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నిందితులను పట్టుకునేందుకు జుహు పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముంబైలో ప్రముఖ సినీ తారలను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న దాడులు చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
Multiple shots fired by unknown gunmen at Tiger Shroff and his driver. Tiger is reportedly safe! But what could be the motive? He doesn’t seem to be involved in any major controversy. More details awaited.#TigerShroff https://t.co/qql4qni4TN
— Nikhil saini (@iNikhilsaini) October 18, 2026బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా?ఈ కాల్పుల ఘటనకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున అనిల్ పండిట్ అనే గ్యాంగ్‌స్టర్ బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఆడియో సందేశం సంచలనం రేపింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయవద్దని తాము హెచ్చరించినా టైగర్ ష్రాఫ్ పట్టించుకోకపోవడం వల్లే ఈ దాడికి పాల్పడినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టు ప్రామాణికతపై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.మరోవైపు ఈ దుర్ఘటన మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, తాజాగా టైగర్ ష్రాఫ్‌పై దాడి ఘటనలతో ముంబైలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని, ముఖ్యమంత్రి శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు.మరింత చదవండి

Source link