ప్రభన్యూస్

Tata: టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా…. టాటా షేర్లు ఢమాల్ | N Chandrasekaran Steps Down as Tata Sons Chairman | బిజినెస్


Last Updated:

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారు. 2027 తర్వాత మళ్లీ చైర్మన్‌గా నియమించుకోవాలని కోరడం లేదు.

News18
News18

టాటా గ్రూప్‌లో కీలక మార్పుకు తెరలేచింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి వరకు పదవిలో ఉండి, ఆ తర్వాత మళ్లీ చైర్మన్‌గా నియమించుకోవాలని కోరుకోవడం లేదని తెలిపారు. ఆగస్టు 12న చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించినట్లు సీఎన్‌బీసీ-టీవీ18 రిపోర్ట్ చేసింది. ప్రస్తుత టర్మ్ పూర్తయ్యే వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారు. ఆ తర్వాత రీ-అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించరు. చంద్రశేఖరన్‌ను మళ్లీ చైర్మన్‌గా నియమించే అంశంపై టాటా సన్స్ ఫిబ్రవరిలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. టాటా గ్రూప్ ఛారిటీ విభాగమైన టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఆయన రీ-అపాయింట్‌మెంట్‌ను వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ గతంలో వెల్లడించింది. చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 11:41 am Digital Edition : Prabhanews
Tata: టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా…. టాటా షేర్లు ఢమాల్ | N Chandrasekaran Steps Down as Tata Sons Chairman | బిజినెస్

Last Updated:Aug 12, 2026 11:29 AM ISTటాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారు. 2027 తర్వాత మళ్లీ చైర్మన్‌గా నియమించుకోవాలని కోరడం లేదు.News18టాటా గ్రూప్‌లో కీలక మార్పుకు తెరలేచింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి వరకు పదవిలో ఉండి, ఆ తర్వాత మళ్లీ చైర్మన్‌గా నియమించుకోవాలని కోరుకోవడం లేదని తెలిపారు. ఆగస్టు 12న చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించినట్లు సీఎన్‌బీసీ-టీవీ18 రిపోర్ట్ చేసింది. ప్రస్తుత టర్మ్ పూర్తయ్యే వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారు. ఆ తర్వాత రీ-అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించరు. చంద్రశేఖరన్‌ను మళ్లీ చైర్మన్‌గా నియమించే అంశంపై టాటా సన్స్ ఫిబ్రవరిలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. టాటా గ్రూప్ ఛారిటీ విభాగమైన టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఆయన రీ-అపాయింట్‌మెంట్‌ను వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ గతంలో వెల్లడించింది. చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.మరింత చదవండి

Source link