Last Updated:
సినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు?
సినిమా అనేది కేవలం కథను తెరపై చూసేది మాత్రమే కాదు.. ప్రేక్షకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తూ, భావోద్వేగాలను కదిలిస్తూ.. అతని ఊహాశక్తితో ముడిపడే అద్భుతమైన ప్రపంచం. ఒక కథను ప్రేక్షకుడు ఎందుకు ఇష్టపడతాడు? ఓ పాత్రతో ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఒక సీన్ మనసులో ఎందుకు బలంగా ముద్రపడుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ.. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లే వెనుక దాగి ఉన్న మేధస్సును విశ్లేషించే అరుదైన ప్రయత్నమే ‘స్క్రీన్ప్లే మాస్టర్ సుకుమార్’ పుస్తకం.

