ప్రభన్యూస్

Yellamma Release Date: ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్.. హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఎప్పుడంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎల్లమ్మ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించి, తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ‘ఎల్లమ్మ’ చిత్రంతో కథానాయకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా చిత్రబృందం మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. దసరా పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు విడుదల తేదీపై స్పష్టత వచ్చినట్లయింది. దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయనను ‘పర్షి’ అనే పాత్రలో పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.

సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా ఎలాంటి ప్రదర్శన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.

‘బలగం’ వేణు ఎల్దండి దర్శకత్వంలో..

‘ఎల్లమ్మ’ చిత్రానికి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ జీవితాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ‘ఎల్లమ్మ’ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐదు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్..

‘ఎల్లమ్మ’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్‌ను ఇతర భాషల ప్రేక్షకులకు కూడా హీరోగా పరిచయం చేసే అవకాశం ఉంది. మొత్తానికి విడుదల తేదీ ప్రకటనతో ‘ఎల్లమ్మ’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 12:06 pm Digital Edition : Prabhanews
Yellamma Release Date: ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్.. హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఎప్పుడంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 23, 2026 12:02 PM ISTదేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎల్లమ్మ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
News18టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించి, తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ‘ఎల్లమ్మ’ చిత్రంతో కథానాయకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా చిత్రబృందం మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. దసరా పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు విడుదల తేదీపై స్పష్టత వచ్చినట్లయింది. దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయనను ‘పర్షి’ అనే పాత్రలో పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా ఎలాంటి ప్రదర్శన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.‘బలగం’ వేణు ఎల్దండి దర్శకత్వంలో..‘ఎల్లమ్మ’ చిత్రానికి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ జీవితాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ‘ఎల్లమ్మ’ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.ఐదు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్..‘ఎల్లమ్మ’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్‌ను ఇతర భాషల ప్రేక్షకులకు కూడా హీరోగా పరిచయం చేసే అవకాశం ఉంది. మొత్తానికి విడుదల తేదీ ప్రకటనతో ‘ఎల్లమ్మ’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.మరింత చదవండి

Source link