Last Updated:
Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన షేర్లలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ టవర్స్, ఇండియామార్ట్, జియో ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఈ కంపెనీలపై HSBC, CLSA, నోమురా వంటి ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు తమ రేటింగ్స్, టార్గెట్ ధరలను వెల్లడించాయి. ఎస్బీఐ లైఫ్‌పై HSBC రూ.2,088 టార్గెట్ ధరతో బై రేటింగ్ కొనసాగించగా, జియో ప్లాట్‌ఫామ్స్‌పై నోమురా రూ.1,340 టార్గెట్‌తో బై రేటింగ్ ఇచ్చింది. ఇండస్ టవర్స్‌కు CLSA రూ.565 టార్గెట్ ధరను ప్రకటించింది. మరోవైపు, సిప్లా, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇండియామార్ట్ షేర్లపై కూడా కీలక అంచనాలు వెలువడ్డాయి. ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వృద్ధి అవకాశాలు, రిస్క్‌లను బట్టి బ్రోకరేజీలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
